కార్తికేయ డైరెక్టర్ ఆ ఇద్దరిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు?

Wed Aug 17 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Karthikeya Director Chandoo Mondeti

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ 'కార్తికేయ 2'. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లపై అభిషేక్ అగర్వాల్ టి.జి. విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. రెండు పలు దఫాలుగా రిలీజ్ వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఆగస్టు 13న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మునానిమస్ టాక్ తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.దేశ వ్యాప్తంగా ఈ మూవీకి కలెక్షన్స్ రోజు రోజుకీ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీతో దర్శకుడు చందూ మొండేటి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన చేసిన 'సవ్యసాచి' ఆశించిన విజయం సాధించకపోవడంతో దర్శకుడిగా రేసులో వెనకబడ్డాడు.

అయితే తాజాగా 'కార్తికేయ'కు సీక్వెల్ గా తెరకెక్కిన 'కార్తికేయ 2'తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. దీంతో ఇప్పడు చందూ మొండేటి పేరు ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపిస్తోంది.

సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ గా శ్రీకృష్ణుడి రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా పయనిస్తున్న నేపథ్యంలో చందూ మొండేటి తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఈ మూవీ రిలీజ్ కి ముందే ప్రముఖ గీతా ఆర్ట్స్ సంస్థ చందూ మొండేటికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసినట్టుగా చెబుతున్నారు. రీసెంట్ గా 'గని'తో ఫ్లాప్ ని సొంతం చేసుకుని ఇమ్మిడియట్ గా హిట్ ని దక్కించుకోవాలనే ఆలోచనలో వున్న వరుణ్ తేజ్ తో ఈ మూవీ వుండే అవకాశం వుందని చెబుతున్నారు.

కానీ దర్శకుడు చందూ మొండేటికి మాత్రం తమిళ హీరో కార్తీతో సినిమా చేయాలని వుందట. తనతో కొత్త తరహా సినిమా చేయాలని చందూ మొండేటి అనుకుంటున్నారట. అయితే గీతా ఆర్ట్స్ వర్గాలు ఫైనల్ గా ఏ హీరోని ఇస్తే ఆ హీరోతో చందూ మొండేటి సినిమా చేసే అవకాశం వుందని ఈ ఇద్దరిలో గీతా ఆర్ట్స్ చందూ మొండేటికి ఏ హీరోని ఫైనల్ చేయనుందన్నది త్వరలోనే తెలియనుందని ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.