కార్తికేయ 2: నార్త్ లో డే 1 - 60 డే 2 - 300 డే 3 - 500+

Mon Aug 15 2022 13:04:15 GMT+0530 (IST)

Karthikeya 2: Nikhil in the North.. a chance

ఇటీవల కాలంలో చాలామంది హీరోలు పాన్ ఇండియా అంటూ నార్త్ ఇండస్ట్రీలో మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలి అనే బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ రూట్లో అందరూ సక్సెస్ అవడం అనేది చాలా కష్టం అని చెప్పాలి. ఏదో డబ్బింగ్ సినిమాలను యూట్యూబ్ లో చూసిన జనాలు థియేటర్ల వరకు రప్పించడం అంటే పెద్ద టాస్క్. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మీడియం రేంజ్ హీరోలుకు చిన్న హీరోల సినిమాలకు నార్త్ ఇండస్ట్రీలు అయితే మంచి గుర్తింపు ఉంది.కొన్ని ఫ్లాప్ సినిమాలు సైతం కంటెంట్ కాస్త క్లిక్ అయినా కూడా టెలివిజన్లో అలాగే యూట్యూబ్లో కూడా నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఇక యువ హీరో నిఖిల్ కు కూడా ఇదివరకే ఎక్కడికి పోతావు చిన్నవాడా కేశవ్ డబ్బింగ్ సినిమాలతో అక్కడ మంచి క్రేజ్ అందుకున్నాడు. హిందీలో యూట్యూబ్లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు అతనికి హిందీలో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపించుకోవడానికి కరెక్ట్ సినిమా దొరికింది.

కార్తికేయ 2 మొదట హిందీలో అంతకు వర్కౌట్ కాదేమో అని 60 స్క్రీన్ లోనే విడుదల చేశారు. కానీ ఆ కొన్ని షోలకే రెస్పాన్స్ ఒక రేంజ్ లో రావడంతో ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరగనుంది. నిర్మాత అభిషేక అగర్వాల్ ఇదివరకే కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో అక్కడ మంచి క్రేజ్ అందుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అదే సెంటిమెంట్తో అక్కడ జనాలను కార్తికేయ 2 సినిమాతో అట్రాక్ట్ చేయబోతున్నారు. సినిమాలో హిందుత్వంపై మంచి పాయింట్స్ హైలెట్ చేయడం శ్రీకృష్ణ పరమాత్ముడిని కూడా హైలెట్ చేస్తూ ఉండటంతో ఈ సెంటిమెంట్ అయితే బాగానే వర్కౌట్ అయింది.

దీంతో ఇప్పుడు స్క్రీన్ సంఖ్య కూడా పెంచుతున్నారు. మొత్తంగా రెండవ రోజుకే 60 నుంచి 300కు స్క్రీన్స్ ను పెంచిన సంగతి తెలిసిందే కొత్త అప్డేట్ ఏంటి అంటే మూడవ రోజు 500+ స్క్రీన్స్ పెంచారు . ఒక విధంగా ఇటీవల కాలంలో ఏ హీరోకు కూడా ఇంత గోల్డెన్ ఛాన్స్ రాలేదని చెప్పవచ్చు. కరెక్ట్ గా కార్తికేయ సినిమాతో నిఖిల్ కు ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం అగ్ర హీరోలే డీలా పడుతున్న సమయంలో నిఖిల్ ధైర్యం చేసి అక్కడ మంచి డిమాండ్ పెంచుకుంటూ ఉండటం విశేషం. మరి నార్త్ బాక్సాఫీస్ వద్ద మనోడు ఎంతవరకు దున్నుతాడో చూడాలి.