కార్తికేయ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ బ్లాస్ట్

Sun Aug 14 2022 15:00:01 GMT+0530 (IST)

Karthikeya 2 Movie Collections

నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే 2014లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వల్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మధ్యలో పలుసార్లు వివిధ కారణాల వలన వాయిదా పడినప్పటికీ కూడా ఎట్టకేలకు శనివారం విడుదలై విడుదలైన మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. ఇతరులు బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు వారి స్వార్థం కోసం. ఈ సినిమాను వెనక్కి పంపినట్లు ఇండస్ట్రీలో అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది.ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం సినిమా కోసం నిఖిల్ ఒకరోజు ఆలస్యంగానే తన సినిమాను విడుదల చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ప్రభావం ఇప్పుడు తిరిగి నితిన్ సినిమా పైన పడింది.

ఎందుకంటే ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమాకి భారీ స్థాయిలో నెగిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు అందరూ కూడా కార్తికేయ 2 సినిమా కోసం ఎగబడుతున్నారు. పైగా థియేటర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంది.

కానీ నితిన్ సినిమా రెండవ రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ తగ్గాయి. ఇక ఎగ్జిబిటర్లు అందరూ కూడా కార్తికేయ 2 సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ లో వేస్తే మాత్రం ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కార్తికేయ 2 సినిమా ఊహించని విధంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక మొదటి రోజు ఈ సినిమా ఎలాంటి వసూళ్లను అందుకుంటుంది వివరాల్లోకి వెళితే.. విడుదలైన అన్ని ఏరియాలో కూడా బయర్లు అందరూ సంతోషపడే విధంగానే కలెక్షన్స్ వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజు 3.50 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుని 5.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా 25 లక్షల వచ్చాయి. ఓవర్సీస్ లో ఈ సినిమాకు 1.30 కోట్లు రావడం విశేషం. ఇక మిగిలిన భాషల్లో కలెక్షన్స్ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక తెలుగులో మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 5.05 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక గ్రాస్ 8.50 కోట్లు వచ్చింది.

కార్తికేయ 2 సినిమా మొత్తంగా తెలుగులో 12.8 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో మార్కెట్లోకి దిగిన ఈ సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 8.25 కోట్లు దక్కించుకోవలసి ఉంది. అయితే ఆదివారం తో పాటు సోమవారం కూడా హాలిడే కావడంతో ఈ రెండు రోజుల్లోనే సినిమా పెట్టిన పెట్టుబడిన వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.