'ఖైదీ' సీక్వెల్ సీక్రెట్ బయటపెట్టిన కార్తి!

Wed Aug 10 2022 23:00:01 GMT+0530 (IST)

Karthi revealed the secret of 'Khaidi' sequel!

కార్తి హీరోగా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ ప్రభు ఎస్. ప్రకాష్ బాబు. హీరోకు హీరోయిన్ వుండాలి... ఆ హీరోయిన్ తో ఓ డ్యూయెట్ వుండాలనే రొటీన్ ఫార్ములాని బ్రేక్ చేస్తూ కంటెంట్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామాగా ప్రమోగాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ తమిళ తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి హీరో కార్తి కెరీర్ లో కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది.ఈ మూవీలో హీరో కార్తి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే ఒక డ్రెస్ తో అది కూడా చిరిగిన చొక్కా.. గళ్ల లుంగీలో కనిపించడం విశేషం. కల్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లలోనే ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ ని చేస్తామంటూ సినిమా రిలీజ్ సమయంలోనే చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఇంత వరకు సీక్వెల్ ని ప్రారంభించలేదు సరి కదా ఇందుకు సంబంధించిన ప్రకటనని కూడా చేయలేదు. ఇటీవల విడుదలైన 'విక్రమ్' సినిమాతో కార్తి 'ఖైదీ'కి కనెక్స్ వుందని తేలిపోయింది.

దీంతో సీక్వెల్ పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. 'పార్ట్ 2' ఎలాంటి ప్రత్యేకతలతో రానుందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో హీరో కార్తి 'ఖైదీ' సీక్వెల్ సీక్రెట్ ని బయటపెట్టేశాడు. కార్తి నటించించిన లేటెస్ట్ మాసీవ్ ఎంటర్ టైనర్ 'విరుమన్'. డైరెక్టర్ శంకర్ ముద్దుల కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ మూవీకి ఎం. ముత్తయ్య దర్శకుడు. ఆగస్టు 11న ఈ మూవీని విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన కార్తి 'ఖైదీ' సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీక్వెల్ వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రారంభం అవుతుందని విజయ్ తో చేయబోతున్న సినిమా పూర్తి చేసిన తరువాతూ 'ఖైదీ' సీక్వెల్ పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు.

అయితే 'విక్రమ్'కు దీనికి ఎలాంటి సంబందంవుంటుందనే విషయాల్ని మాత్రం కార్తి చెప్పడానికి నిరాకరించాడట. కమల్ నటించిన 'విక్రమ్'లోని ఓ సన్నివేశంలో 'ఖైదీ' సీన్ కనిపిస్తుంది. బిజోయ్ పాత్ర ఢీల్లీతో కలిసి లారీలో వెళుతున్న సన్నివేశాలని చూపించారు.

అయితే ఈ మూవీకి 'విక్రమ్' కి సంబంధం వుందని తేలిపోయింది. ఇక విజయ్ సినిమాకు కూడా విక్రమ్ 'ఖైదీ' మూవీలతో ఇంటర్ లింక్ వుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తయిన తరువాతే 'ఖైదీ' సీక్వెల్ ని స్టార్ట్ చేయనున్నాడట. అంటే విజయ్ ప్రాజెక్ట్ లో 'ఖైదీ' సీక్వెల్ సీన్స్ కి లీడ్ ఇవ్వబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.