Begin typing your search above and press return to search.

దీపావ‌ళి స‌మ‌రానికి కార్తి సై అంటున్నాడుగా

By:  Tupaki Desk   |   24 May 2022 1:40 PM GMT
దీపావ‌ళి స‌మ‌రానికి కార్తి  సై అంటున్నాడుగా
X
విభిన్న‌మైన చిత్రాల‌తో త‌మిళంతో పాటు తెలుగులోనూ త‌న స‌త్తాచాటుకుంటూ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో కార్తి. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అందులో ఒక‌టి `స‌ర్దార్‌` పేరుతో రూపొందుతుండ‌గా మ‌రొక‌టి `విరుమ‌న్‌`గా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని హీరో సూర్య‌, జ్యోతిక 2డీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. ముత్త‌య్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ద్వారా ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ముద్దుల త‌న‌య అదితి శంక‌ర్ హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ మూవీని ఆగ‌స్టు 31న విడుద‌ల చేస్తున్నామ‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన హీరో కార్తి అదే త‌ర‌హాలో తాను న‌టిస్తున్న `స‌ర్దార్‌` రిలీజ్ టైమ్ ని కూడా చెప్పేశాడు. కార్తి న‌టిస్తున్న స్పై థ్రిల‌ర్ ఇది. మిత్ర‌న్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఎస్‌. ల‌క్ష్మ‌ణ్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాశిఖ‌న్నా, `జై భీమ్` ఫేమ్ ర‌జీషా విజ‌య‌న్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు.

కీల‌క పాత్ర‌లో ఒక‌నాటి హీరోయిన్ లైలా క‌నిపించ‌బోతోంది. 16 ఏళ్ల విరామం త‌రువాత లైలా న‌టిస్తున్న సినిమా ఇది. ఇందులో కార్తీ టూ షేడ్స్ వున్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. తండ్రీ, కొడుకులుగా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కార్తి ఏజ్డ్ గెట‌ప్ కు సంబందించిన లుక్ ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ యంగ్ లుక్ కు సంబంధించిన లుక్ ని ఇంత వ‌ర‌కు రివీల్ చేయ‌లేదు. మంగ‌ళ‌వారం యంగ్ లుక్ కి సంబంధించిన పోస్ట‌ర్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా హీరో కార్తి విడుద‌ల చేశారు.

``స‌ర్దార్` నుంచి సెకండ్ లుక్ ని విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా వుంది. ఈ యంబీషియ‌స్ ప్రాజెక్ట్ తో దీపావాళిని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నాం` అంటూ ట్వీట్ చేశారు. కార్తీ విడుద‌ల చేసిన సెకండ్ లుక్ చాలా టెర్రిఫిక్ గా వుంది. ఫ‌స్ట్ గెట‌ప్ కు సంబంధించిన లుక్ ని ఖైదీగా ప‌రిచ‌యం చేస్తే సెకండ్ లుక్ ని మాత్రం ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా చూపించిన తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. క‌ల‌ర్ సోడా ప‌ట్టుకుని బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని అల్ల‌ర‌ర్ల మ‌ధ్య మైక్ ప‌ట్టుకుని కార్తీ క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కీల‌క విల‌న్ గా న‌టిస్తున్న ఈ మూవీలో ముర‌ళీశ‌ర్మ‌, ఇళ‌వ‌ర‌సు, మునిష్ కాంత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హ‌క్కుల్ని త‌మిళ‌, తెలుగు భాష‌ల్లోనూ `ఆహా` ఓటీటీ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. జీవీ ప్ర‌కాష్ సంగీతం, జార్జ్ సి. విలియ‌మ్స్ ఫొటోగ్ర‌ఫీ, దీలీప్ సుబ్బ‌రాయ‌న్ యాక్ష‌న్‌, రుబేన్ ఎడిటింగ్‌, క‌దీర్ ఆర్ట్‌.