Begin typing your search above and press return to search.

ఖైదీ స్టోరీ మొత్తం చెప్పేశాడు..

By:  Tupaki Desk   |   21 Oct 2019 5:24 AM GMT
ఖైదీ స్టోరీ మొత్తం చెప్పేశాడు..
X
ఈ దీపావళికి కాస్త ముందుగా విడుదలవుతున్న రెండు డబ్బింగ్ చిత్రాల్లో ఒకటి ఖైదీ. కార్తీ నటిస్తున్న ఈ సినిమా లుక్ మొత్తం రఫ్ గా ఉండటం.. దానికి తగ్గట్లే సినిమా పేరుతో ఈ సినిమా ఎలా ఉంటుందన్న దానిపై కొన్ని అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ సినిమా కథ మొత్తాన్ని సింఫుల్ గా చెప్పేసినట్లే చెప్పేసి.. సినిమా ఎలా ఉంటుందన్న పూర్తి పిక్చర్ ను ఇచ్చేశాడు కార్తీ.

ఒక రోజు రాత్రి నాలుగు గంటల పాటు జరిగే కథే ఖైదీ అని.. దాన్ని రెండుపావు గంటల్లో చెప్పేసినట్లు వెల్లడించాడు. పదేళ్లుగా జైల్లో ఉన్న ఒక ఖైదీ విడుదల కావటం అన్న పాత్రను తాను పోషించినట్లు చెప్పాడు. పదేళ్లు జైల్లో ఉండటంతో కూతుర్ని చూసుకోలేకపోతాడు. దీంతో.. పదేళ్ల తర్వాత కుమార్తెను చూసుకునేందుకు అతడికి ఎదురైన అడ్డంకులు.. చివరకు పాపను చూస్తాడా? లేదా? అన్నదే చిత్ర కథగా చెప్పేశాడు.

ఈ సినిమాలో బోలెడంత థ్రిల్ ఉందని.. సస్పెన్స్ కు కొరత లేదని స్పష్టం చేశాడు. మాంచి బిగువుగా సాగే సినిమాకు పంటి కింద రాళ్ల మాదిరి పాటలు.. రొమాన్స్ ఉండకూదన్న ఉద్దేశంతో ఈ సినిమాలో అవేమీ పెట్టలేదన్న కార్తీ మాటలు సినిమా మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాయని చెప్పాలి.

ఏదో ఉందన్నట్లు ఊరించే దానికి భిన్నంగా.. తన సినిమాలో ఏం ఉంది.. మరేం లేదన్న విషయాన్ని వివరంగా చెప్పేసిన కార్తీ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. ఖైదీ ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటాడో? లేదన్నది ఈ వారాంతానికి క్లారిటీ వచ్చేస్తుందని చెప్పక తప్పదు.