ఫోటో స్టొరీ: కరిష్మా బికినీ.. కిల్లింగ్ పోజు

Sun Sep 15 2019 15:00:01 GMT+0530 (IST)

Karishma Sharma in Bikini

బాలీవుడ్ లో ఉన్న సూపర్ హాట్ బ్యూటీస్ లిస్టులో కరిష్మా శర్మ పేరు కూడా ఉంటుంది. ఈ పాతికేళ్ళ ముంబై పాప 'ఎంటీవీ వెబ్డ్'.. 'కామెడి సర్కస్' లాంటి పలు టీవీ షోలలో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ లో 'ప్యార్ కా పంచనామా 2' .. 'హోటల్ మిలన్' లాంటి సినిమాల్లో నటించింది.  ఎఎల్టీ బాలాజీ వారి 'రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్'. ఈ ఘాటు వెబ్ సీరీస్ లో రాగిణి పాత్రతో ఒక్కసారిగా అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది.ఈ జెనరేషన్ లో ఉన్న మిగతా హాట్ బ్యూటీల స్టైల్లోనే ఈ భామ కూడా మీడియాలో మంటలు రేపగల దిట్ట.  తాజాగా కరిష్మా ఇన్స్టాగ్రామ్ లో తన తడాఖా చూపించింది.  ఒక బికినీ ఫోటో  పోస్ట్ చేసింది.  "అతడు బ్లాక్ అండ్ వైట్ లో చూస్తాడు.. గ్రే లో ఆలోచిస్తాడు.  కానీ కలర్ ను ప్రేమిస్తాడు" అంటూ అర్థం అయ్యి అర్థం కానీ క్యాప్షన్ ఇచ్చింది.  క్యాప్షన్ సంగతి పక్కన పెడితే ఈసారి ఈ కరిష్మ బికినీ ధరించింది.  అంతే కాదు.  బికినీతో ఎవరైనా బీచ్ లో ఫోటో షూట్ చేస్తారు కానీ ఈ భామ మాత్రం వెరైటీగా ఒక భవనం డాబాపై పోజులిచ్చింది. అక్కడ నిలుచుని అత్యంత హాటు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.  మెడకు ఒక ఫర్ లాంటి దండ ఏదో తగిలించుకుంది. ఫోటో బ్లాక్ అండ్ వైట్ కావడంతో మహా కళాత్మకంగా ఉంది. ఇలాంటి ఫోటో షూట్లు చెస్తే ఫ్యూచర్ లో హాటు బాలీవుడ్ భామల లిస్టులో పేరు లేకుండా ఉంటుందా?

ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి.  "బికినీ మస్త్ హై".. "బాలీవుడ్ గ్లామర్ బాంబ్".."కాస్త డీసెంట్ బికినీ వేసుకో".. "బికినీ మరీ షార్ట్ గా ఉందే" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే కరిష్మా రీసెంట్ గా హృతిక్ రోషన్ 'సూపర్ 30' లో ఒక స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది.  ప్రస్తుతం అయితే  కరిష్మా చేతిలో సినిమా ఆఫర్లేమీ లేవు.