Begin typing your search above and press return to search.

ప్ర‌స‌వానంత‌ర వెత‌ల్ని యోగాతో అధిగ‌మించాను!-బెబో

By:  Tupaki Desk   |   22 Jun 2021 4:30 AM GMT
ప్ర‌స‌వానంత‌ర వెత‌ల్ని యోగాతో అధిగ‌మించాను!-బెబో
X
జీవితంలో యోగా ప్రాముఖ్య‌త గురించి బెబో క‌రీనా క‌పూర్ ఖాన్ అద్భుత‌మైన టిప్ చెప్పారు. మ‌హిళ‌ల‌కు ప్ర‌సవానంత‌ర వెత‌ల్ని అధిగ‌మించేందుకు ఏం చేయాలో కూడా అంత‌ర్జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా అవేర్ నెస్ పెంచే ప్ర‌య‌త్నం చేశారు. ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్లిగా నేటికీ తాను అంత ఫిట్ గా ఉండ‌డానికి కార‌ణమేమిటో క‌రీనా వెల్ల‌డించారు.

కరీనా కపూర్ ఖాన్ తన రెండో కిడ్ ని ప్రసవించిన నాలుగు నెలల తర్వాత క్రమంగా యోగా సెష‌న్స్ కు తిరిగి వెళ్తున్నానని చెప్పారు. సైఫీనా జంట‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ రెండవ కుమారుడిని స్వాగతించారు. యోగా డే సంద‌ర్భంగా ఇన్ స్టాలో కరీనా కపూర్ తన ఇంట్లోనే అస‌నాలు వేస్తున్న ఫోటోల‌ను పోస్ట్ చేశారు.

2006 లో నేను తాషన్ - జబ్ వి మెట్ లకు సంతకం చేసినప్పుడు నా యోగా ప్రయాణం ప్రారంభమైంది. నమ్మశక్యం కాని ప్ర‌యాణ‌మిది ... ఇది నన్ను ఆరోగ్యంగా బలంగా ఉంచింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు నాలుగు నెలల ప్రసవానంతరం కోలుకోవ‌డానికి యోగా ఉప‌యోగ‌ప‌డంది. ఈసారి నేను అలసిపోయాను.. రిక‌వ‌రీ కోసం చాలా వేచి చూసాను.. నెమ్మదిగా స్థిరంగా తిరిగి పాత రూపానికి వస్తున్నాను.. అని క‌రీనా తెలిపారు. యోగా సమయం ప‌రంగా స్థిరత్వం కీలకం.. మీరు కూడా అలా చేస్తారని ఆశిస్తున్నాను అని క‌రీనా అన్నారు.

కరీనా తన రెండవ కుమారుడు జన్మించిన కొన్ని వారాల తర్వాత తిరిగి పనిని ప్రారంభించారు. త‌న‌ నివాసం వద్ద చురుకైన నడక వ్యాయామం ప్రారంభించారు. ఇంట్లోనే జిమ్ యోగా కూడా చేసారు. సైఫ్ - కరీనా తన రెండవ బిడ్డ వచ్చినప్పటి నుండి తన కుటుంబంతో గడిపారు. మార్చిలో ఆమె తిరిగి పనిని ప్రారంభించినా సెకండ్ వేవ్ వ‌ల్ల షూటింగులు నిలిపేసాక ఇంట్లోనే ఉన్నారు. అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చద్దా`లో కరీనా కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.