సైఫ్ లూజ్ చొక్కాలో దూరి వేడెక్కించేసిందిగా

Wed Aug 12 2020 10:15:26 GMT+0530 (IST)

Kareena Kapoor Latest Stunning Pose For Filmfare Magazine

పటౌడీ సామ్రాజ్యపు మహారాణి కరీనా కపూర్ గురించి పరిచయం అవసరం లేదు. సైజ్ జీరోతో బాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన ట్రెండీ స్టార్. సైఫ్ ఖాన్ ని పెళ్లాడి తైమూర్ కి మమ్మీ అయినా ఇంకా కెరీర్ పరంగా ఏమాత్రం తగ్గడానికి ఇష్టపడడం లేదు. నాలుగు పదుల వయసుకు చేరువైన ఈ బ్యూటీ ఇప్పటికే బాలీవుడ్ లో రెండు దశాబ్ధాల కెరీర్ ని పూర్తి చేసుకుంది.ఒక బిడ్డకు తల్లి అయినా కానీ కరీనా అందచందాలు ఎక్కడా తగ్గలేదు. నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ రూపలావణ్యాన్ని తిరిగి కంబ్యాక్ చేసిన తీరు అసమానం. అందుకు ఈ లేటెస్ట్ మ్యాగజైన్ ఫోటోషూట్ ఒక ప్రూఫ్. ఫిలింఫేర్ ఆగస్ట్ కవర్ పేజీపై బెబో కరీనా ఇలా దర్శనమిచ్చింది. ఇక మ్యాగజైన్ షూట్ లో థై షోస్ సహా అందాల ఆరబోతతో మతి చెడగొట్టింది.

లూజ్ వైట్ షర్ట్ తో టాప్ లేపేసిన కరీనా బాటమ్ లో ఎలాంటి ఆచ్చాధనా లేకుండా కనిపించి షాకిచ్చింది. సైఫ్ ఖాన్ తన చొక్కాలను అరువు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పింది. అంతేకాదు.. నెటిజనులు తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను క్లిక్ చేసినందుకు సైఫ్ కు ప్రధాన క్రెడిట్ ఇస్తోంది. భర్త సైఫ్ విసిరిపారేసిన లూజ్ చొక్కాలలో కరీనా ఎంతో సెక్సీగా కనిపిస్తోంది. శృంగార రస నాయికనే మించిపోతోంది అంటూ నెటిజనులు కామెంట్లతో హోరెత్తించేస్తున్నారు.