Begin typing your search above and press return to search.

బేబి బంప్ తో బెబో ధ్యాన‌ముద్ర కామ్ యోగా..!

By:  Tupaki Desk   |   25 Jan 2021 11:04 AM GMT
బేబి బంప్ తో బెబో ధ్యాన‌ముద్ర కామ్ యోగా..!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ లైఫ్ లో కీల‌క ఘ‌డియ ఆస‌న్న‌మైంది. థైమూర్ అలీఖాన్ త‌ర్వాత త‌న రెండో బిడ్డ‌కు బెబో జ‌న్మ‌నివ్వ‌నున్నారు.

భర్త సైఫ్ అలీ ఖాన్ ‌తో కలిసి తన రెండవ బిడ్డను ఆశిస్తున్న కరీనా కపూర్ శనివారం తన కుటుంబ సభ్యులను క‌లిసిన‌ప్ప‌టి ఓ ఫోటోని షేర్ చేసుకోగా అది వైర‌ల్ అయ్యింది. త‌న‌ సోదరి కరిష్మా కపూర్- బావ అనిస్సా మల్హోత్రా.. అత్త రిమా జైన్ ఈ ఫోటోలో త‌న‌తో ఉన్నారు. ఇష్టమైన వ్యక్తులతో మంచి రోజు అంటూ ర‌క‌ర‌కాల ఫోటోల్ని షేర్ చేశారు ఆమె. కరీనా- కరిష్మా కపూర్ ఇరువురూ బాంద్రాలో ఫోటోలు దిగారు. వాట‌న్నిటినీ క‌రీనా ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి .

అంతేకాదు.. కరీనా తన ఇన్ స్టా లో బేబి బంప్ ఫోటోషూట్ నుండి ఒక ఆస‌క్తిక‌ర ఫోటోని షేర్ చేశారు. `చిన్న పాటి యోగా... అంతే కామ్ గా..` అన్న క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ ఫోటోలో క‌రీనా త‌న బేబీ(పొట్ల‌పై)ని పైన కింద తాకుతూ చేతులు వేసి ధ్యానంలో ఉన్న ఫోటో ఆద్యంతం ఉత్కంఠ పెంచింది. గ‌ర్భ‌ధార‌ణ‌కు స‌మ‌యమాస‌న్న‌మ‌వుతున్న వేళ క‌రీనా ఎంతో సౌక‌ర్య‌మైన దుస్తుల్ని ధ‌రించి క‌నిపిస్తున్నారు. పింక్ వ‌ర్ణం దుస్తుల్ని క‌రీనా ధ‌రించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అభిమానుల్లోకి దూసుకొచ్చింది. ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఫ్యాన్స్ ఈ ఫోటోని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. త‌షాన్ షూటింగ్ లో ప్రేమ‌లో ప‌డిన సైఫ్‌-క‌రీనా జంట ఆ త‌ర్వాత ఇరువైపులా పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడారు.

ప్ర‌స్తుతం సైఫ్ .. క‌రీనా కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. ఓవైపు బేబి బంప్ తోనే ప‌లు క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించి స‌ర్ ప్రైజ్ చేశారు క‌రీనా. సైఫ్ ఓవైపు వెబ్ సిరీస్ లు.. సినిమాల‌తో బిజీ. ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆదిపురుష్ 3డిలో అత‌డు రావ‌ణుడిగా న‌టించ‌నున్నారు.