40వ వసంతంలోకి అడుగుపెట్టిన బెబో...!

Mon Sep 21 2020 17:20:03 GMT+0530 (India Standard Time)

Bebo enters the 40th year ...!

కపూర్ ఫ్యామిలీ నటవారసురాలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన కరీనా కపూర్.. అందంతో పాటు అభినయం కూడా తన సొంతమని నిరూపించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 'రెఫ్యూజీ' సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన బెబో కరీనా.. 20 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 2012లో హీరో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయినప్పటికీ నటనకు దూరం కాకుండా సినిమాల్లో నటిస్తోంది. కరీనా కపూర్ నేటితో 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో కరీనాకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.కాగా కరీనా తన పుట్టినరోజును కేవలం కుటుంబ సభ్యుల మధ్య సెలెబ్రేట్ చేసుకున్నారు. భర్త సైఫ్ అలీఖాన్ - సోదరి కరిష్మా కపూర్ - తల్లిదండ్రులు బబిత - రణధీర్ లతో కలిసి బర్త్ డే జరుపుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు నాలుగు పదుల వయసు మీద పడిన కరీనాకు వయసు పెరుగుతున్న కొద్దీ అందం కూడా పెరుగుతోంది అని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక 40వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా కరీనా స్వయంగా ఓ లేఖ రాశారు. తన సినీ ప్రస్థానాన్ని.. జీవితంలో జరిగిన సంఘటలను గుర్తు చేసుకుంటూ శక్తివంతురాలిగా ఉన్నందుకు తనకు తాను థ్యాంక్స్ చెప్పుకుంది. 'స్ట్రాంగ్ ఉమెన్ గా అవడానికి తీసుకున్న నా నిర్ణయాల్లో అనుభవాల్లో కొన్ని గొప్పవి ఉన్నాయి. తప్పులు కూడా ఉన్నాయి. మర్చిపోలేనివి కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ బర్త్ డే నాకు గొప్ప అనుభూతినిస్తోంది' ని కరీనా తన లేఖలో పేర్కొన్నారు. కరీనా ప్రస్తుతం అమీర్ ఖాన్ సరసన 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నటిస్తోంది.