ప్రభాస్ కోసం చేతులు కలిపిన కరణ్ జోహార్

Sat Jan 29 2022 18:00:01 GMT+0530 (IST)

Kareena Johar joins hands for Prabhas

ప్రభాస్ నటించిన సంచలన చిత్రం `బాహుబలి`కి దేశ వ్యాప్తంగా క్రేజ్ని తీసుకురావడంలో బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ పాత్ర ఎంతో వుంది. అందుకే తెలివిగా ఆయనని రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కి పార్ట్నర్ గా మార్చుకున్నారు. ఆ తరువాత ఉత్తరాదిలో ఈ మూవీకి ఏ స్థాయి ప్రచారం దక్కిందో తెలిసిందే. ఉత్తరాదిలో `బాహుబలి` కారణంగా ప్రభాస్ అంటే తెలియని వాళ్లు లేరు. అంతగా ప్రభాస్ పేరు మారుమ్రోగిపోయింది. మళ్లీ ఇప్పుడు అదే ప్లాన్ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది.ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న `లైగర్` మూవీకి కరణ్ జోహార్ వన్ ఆఫ్ ది పార్ట్నర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిపిందే. ఇదే తరమాలో ప్రభాస్ నటిస్తున్న మరో ప్రాజెక్ట్ కి కరణ్ జోహార్ పార్ట్ నర్ గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ - నాగ్ అశ్విన్ ల కలయకలో `ప్రాజెక్ట్ - కె` పేరుతో పాన్ వరల్డ్ స్థాయి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మెంటర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద క్రేజీ ప్రాజెక్ట్ గా నిలబోతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా కాదని పాన్ వరల్డ్ స్థాయిలో తెరపైకి రాబోతోందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో షాకింగ్ సర్ ప్రైజ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.  

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పార్ట్ నర్ గా ఎంట్రీ ఇస్తున్నారని లేటెస్ట్ టాక్. బాలీవుడ్ మార్కెట్ లో కరణ్ హవాని దృష్టిలో పెట్టుకుని ఆయనని ఈ చిత్రానికి భాగస్వామిని చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మార్కెట్ లో మన సినిమా రిలీజ్ కావాలంటే అక్కడి బిగ్గీ తో చేతులు కలపాల్సిందే. ఇప్పటికే కరణ్ జోహార్ ఆర్ ఆర్ ఆర్ లైగర్ చిత్రాలకు భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

దీంతో `ప్రాజెక్ట్ కె`కి కూడా ఆయనని నిర్మాణ భాగస్వామిగా మార్చుకోవాలని భావించిన మేకర్స్ తాజాగా ఆయనని సంప్రదించడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని టాక్ ఇవినిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా తరువాత కరణ్ బాలీవుడ్ లో నాగ్ అశ్విన్ - ప్రభాస్ లతో స్ట్రెయిట్ హిందీ మూవీని నిర్మించాలనే ఆలోచనలో వున్నారట. అందులో భాగంగానే ముందు ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.