అన్ లిమిటెడ్ మ్యాడ్ నెస్ అంటున్న ఫిలింమేకర్

Thu Jun 27 2019 16:15:08 GMT+0530 (IST)

బాలీవుడ్ లో ఇప్పుడు జోరుగా ఉన్న ట్రెండ్స్ రెండు. ఒకటి బయోపిక్స్.. రెండు సీక్వెల్స్.  కొత్తగా మొదలుపెట్టబోయే ప్రాజెక్టులలో దాదాపుగా ఇవే సగం ఉన్నాయి.  తాజాగా ఫిలింమేకర్ కరణ్ జోహార్ ఈ ట్రెండ్ ను కొనసాగిస్తూ తన బ్యానర్ లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 'దోస్తానా' కు సీక్వెల్ ప్రకటించారు.'దోస్తానా 2' సినిమాను ప్రకటించిన కరణ్ జోహార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా "అన్ లిమిటెడ్ మ్యాడ్ నెస్ తో దోస్తానా ఫ్రాంచైజీ మీ ముందుకు రానుంది. కార్తీక్ ఆర్యన్.. జాన్వి కపూర్ & మరో హీరో( కొత్తగా లాంచ్ చేస్తున్నాం) తో #దోస్తానా2.  కోలిన్ డి కన్హా ఈ సినిమాకు దర్శకుడు.  మూడో అబ్బాయి కోసం వేచి చూడండి" అంటూ ట్వీట్ చేశారు.  దీంతో 'దోస్తానా 2' పై ఫుల్ క్లారిటీ వచ్చినట్టే. గతంలో 'దోస్తానా2' పై చాలా రకాల వార్తలు వినిపించాయి.  సీక్వెల్ లో అలియా భట్.. జాన్ అబ్రహం.. రాజ్ కుమార్ రావు నటిస్తారని అన్నారు. కానీ అప్పట్లోనే ఆ వార్తలను కరణ్ జోహార్ ఖండించారు.  

2008 లో విడుదలైన 'దోస్తానా' లో జాన్ అబ్రహమ్.. ప్రియాంక చోప్రా.. అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించారు.  ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి తరుణ్ మన్ సుఖాని దర్శకత్వం వహించారు.  అనుకోని కారణాల వల్ల జాన్ అబ్రహమ్.. అభిషేక్ బచ్చన్ ఇద్దరూ తమను గే జంటగా చెప్పుకుంటారు. అయితే ఇద్దరూ ప్రియాంక చోప్రాతో లవ్ లో పడిపోతారు.  కానీ ప్రియాంక ఏమో వీరిద్దరిని బెస్ట్ ఫ్రెండ్స్ గా చూస్తూ మరో అతనితో లవ్ లో పడుతుంది.  సరదాగా సాగే ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది.  మరి ఈ సినిమాతో జాన్వి..కార్తిక్ ఆర్యన్లకు మంచి బ్రేక్ వస్తుందేమో వేచి చూడాలి.  ఈ క్రేజీ సీక్వెల్ లో మరో హీరోగా ఎవరికి అవకాశం లభిస్తుందో మరి.