కరణ్ పార్టీలో కళ్లన్నీ ఈ కుర్ర బ్యూటీపైనే..!

Fri May 27 2022 23:00:01 GMT+0530 (IST)

Karan Johar Birthday Bash

ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ పరిశ్రమ మొత్తం హాజరైంది. టాలీవుడ్ నుంచి పలువురు స్టార్లు పిలుపందుకున్నారు. ముంబై శివార్లలోని యష్ రాజ్ స్టూడియోస్ లో జరిగిన ఈ వేడుకకు పరిశ్రమ ముఖ్యుల హాజరుతో విపరీతంగా ఆకర్షించింది. కరణ్ తన 'బ్లింగ్ అండ్ బ్లాక్' పుట్టినరోజు ఈవెంట్ లో బోలెడంత సందడి చేసాడు. ఈ వేడుకకు విచ్చేసిన సెలబ్రిటీలు తమ అత్యంత అధునాతనమైన గ్లిట్జ్ అండ్ గ్లామ్ లుక్ ని ఎలివేట్ చేసేందుకు ఒకరితో ఒకరు పోటీపడ్డారు. వెరైటీ గ్లామరస్ దుస్తుల్లో ప్రత్యక్షమయ్యారు.



సల్మాన్ ఖాన్- హృతిక్ రోషన్- రాణి ముఖర్జీ- అలాగే అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్- కత్రిన- కరీనా- మీరా రాజ్ పుత్- కరిష్మా తదితరులు వేడుకలో ఉన్నారు. ఈ వేడుకలో పలువురు యువనాయికలు సెలబ్రిటీలు తమ అద్భుతమైన దుస్తులతో వేడిని పెంచారు. కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు ఈవెంట్ లో ఉత్తమ దుస్తులు ధరించిన ప్రముఖుల జాబితాలో చాలా పేర్లు ఉన్నా కానీ ఇందులో ఒక అందగత్తె ప్రత్యేకించి షో స్టాపర్ గా నిలిచింది.

యువనాయికల్లో సారా ధరించిన స్పెషల్ డ్రెస్ విపరీతంగా ఆకర్షించింది. ఎవరికి వారు యూనిక్ నెస్ తో కూడుకున్న డిజైనర్ దుస్తులు ధరించినా కళ్లన్నీ సారా పైనే  ప్రసరించేంత స్పెషల్ గా కనిపించింది.

సారా అలీఖాన్ ఫోటోలు లీక్ కాగానే ఈ వేదికపై ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపించిందంటూ అభిమానులు కితాబిచ్చారు. బ్లాక్ పర్పుల్ డ్రెస్ కి కాంబినేషన్ గా బ్లాక్ బెల్ట్ ధరించి ఎంతో స్టైలిష్ గానూ కనిపించింది.

తాజాగా రిలీజైన ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలో ఉత్తమ దుస్తులు ధరించిన అందగత్తెల జాబితాను వెతికితే.. కియారా అద్వానీ షానయా కపూర్- జాన్వీ కపూర్ - అనన్య పాండే - సారా అలీఖాన్- రష్మిక మందన ఒకరితో ఒకరు పోటీపడ్డారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సారా అలీఖాన్ ఇటీవల విక్కీ కౌశల్ తో తన తదుపరి చిత్రాన్ని పూర్తి చేసింది. అలాగే పలు భారీ చిత్రాలకు సంతకాలు చేసింది. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. గ్యాస్ లైట్ మూవీ సహా ప్రముఖ ఫిలింమేకర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న సినిమా చిత్రీకరణ దశలో ఉన్నాయి.