తాప్సీ పై కరణ్ అక్కసు అలా తీర్చుకుంటున్నాడా?

Fri Sep 30 2022 12:37:59 GMT+0530 (India Standard Time)

Karan Johar About Tapsee Pannu

బాలీవుడ్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' ఏడవ సీజన్ దిగ్విజయంగా ముగిసింది. 12 వారాల పాటు అలరించిన ఈ షోలో అలియాభట్..రణవీర్ సింగ్..జాన్వీకపూర్..సారా అలీఖాన్..విజయ్ దేవరకొండ..సమంత...అక్షయ్ కుమార్.. అనన్యా పాండే..అమీర్ ఖాన్  తారంలంతా పాల్గొన్నారు. కరణ్ హాట్ ప్రశ్నలకు అంతే ధీటుగా..హాట్ గా సమాధానాలిచ్చి టాక్ షోలో విజయంలో భాగమయ్యారు.మరి ఇంత వరకూ తాప్సీని ఎందుకు షోకి ఆహ్వనించలేదంటే? కరణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. '12 ఎపిసోడ్ల సీజన్ ఇది. ప్రేకుల్ని అలరించే జోడీల్ని ఎంపిక చేసాం. తాప్సీకి సెట్ అయ్యే జోడి కుదిరితో కచ్చితంగా పిలుస్తా. ఆమెను నేనే స్ వయంగా ఆహ్వానిస్తా..అప్పుడామె తప్పకుండా  రావాలి. ఒప్పుకోకపోతే బాధపడతాను' అని అన్నారు.

మరి కరణ్ తాప్సీ విషయంలో అంతగా! నొక్కి ఎందుకు ఒక్కాణించినట్లు? 'కుదర్లేదు. అందువల్లే పిలవడం లేదు అనేస్తే సరిపోయేది. కానీ కరణ్ వింత సమాధానం పాత విషయాల్ని కెలుకుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో ఇదే టాక్ షో పై తాప్సీ వ్యంగ్యాస్ర్తాలు సంధించిన సంగతి తెలిసిందే. ఆ షోలో పాల్గొనేంత ఆసక్తి..ఆతృత నాకు లేవని..అంతకు మించి శృంగార జీవితం గు రించి చెప్పాల్సిన విషయం తన దగ్గర దేదని వ్యంగ్యాస్ర్తాలు సంధించింది.

వాటికి కౌంటర్ గానే కరణ్ తాప్సీ విషయంలో రివర్స్ కౌంటర్ ని తనదైన శైలిలో వేసాడని నెటి జనులు ముచ్చటించు కుంటున్నారు. ఇద్దరి మధ్య ఇలాంటి సైలెంట్ కోల్డ్ వార్ నడిస్తే ఆహ్వనించినా తాప్సీ ఎలా వస్తుంది? కరణ్ ఎందుకు పనిగట్టకుని ఆమెకు ఎందుకు వెల్కమ్ చెబుతాడు? అంటూ మాట్లాడుకుంటున్నారు.

కరణ్ టాక్ షో అంటే శృంగార జీవితం..వ్యక్తిగత ఎఫైర్లకు సంబంధించని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కి చేస్తారన్న సంగతి తెలిసిందే. వాటిని ఎదుర్కోనే సత్తా ఉంటేనే? కరణ్ తో కాఫీకి కూర్చోవాలి.  లేదంటే?  రెస్టారెంట్ ఉత్తమం అన్నది గ్రహించాల్సిన విషయం.

ఈ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అంతకు మించి విమర్శలు ఎప్పటికప్పుడు ఎదుర్కుంటూనే  ఉంది. అయినా ఇండియా వైడ్ షో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగులో బిగ్ బాస్ పై కూడా ఇలాంటి విమర్శలే తెరపైకి వస్తున్నాయి. తిట్టే వాళ్లు తప్ప! పొగిడే వారు తక్కువ. కానీ ఆ షోకి ఆదరణ మాత్రం పీక్స్ లోనే ఉందన్నది వాస్తవం.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.