హాఫ్ సెంచరీ కొట్టిన ఇండస్ట్రీ డీన్ నెక్ట్స్ ఏంటి?

Tue May 24 2022 17:00:47 GMT+0530 (IST)

Karan Johar 50th Birthday Celebrations

ఇండస్ట్రీ డీన్.. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హాఫ్ సెంచరీ కొట్టారు. మే 25 నాటికి 50 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆయన తనదైన స్టైల్లో  50వ పుట్టినరోజు వేడుకలను ముంబైలో ఘనంగా జరుపుకోనున్నాడు.ఈ సంవత్సరం ప్రారంభంలో కరణ్ తన స్నేహితుడు- ధర్మ ప్రొడక్షన్స్ CEO అయిన అపూర్వ మెహతా 50వ పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. ఇంతలోనే తాను కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు.

మే 25న యష్ రాజ్ స్టూడియోస్ లో కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా థీమ్ పార్టీని నిర్వహించనున్నారు. దీనికోసం యష్ రాజ్ స్టూడియోస్ ను మే 25న బుక్ చేసుకున్నారు. ఈసారి సాధారణ 5-స్టార్ .. 7-స్టార్ పార్టీలకు దూరంగా ఉన్నారు.

పార్టీ థీమ్ బ్లాక్ అండ్ బ్లింగ్ అయితే.. కళాంక్ - యే జవానీ హై దీవానీ- బ్రహ్మాస్త్ర- రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ వంటి చిత్రాల సెట్ లను రూపొందించిన అమృత మహల్ పార్టీ వెన్యూని డిజైన్ చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా కరణ్ జోహార్ తో కలిసి ఈ వేడుకను జరుపుకోవాలని భావిస్తున్నారు. ధర్మ ప్రతిభ కూడా గ్రాండ్ పుట్టినరోజు వేడుకలలో కనిపిస్తుంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే... కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' చిత్రానికి దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీలో రణవీర్ సింగ్- అలియా భట్- ధర్మేంద్ర- జయా బచ్చన్ - షబానా అజ్మీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ నాటికి సినిమా పూర్తవుతుందని సమాచారం. కరణ్ తన పాపులర్ చాట్ షో కాఫీ విత్ కరణ్ కోసం కూడా షూటింగ్ చేస్తున్నాడు. దోస్తానా 2 - లైగర్ సహా పలు భారీ చిత్రాలను కూడా ఆయన నిర్మిస్తున్నారు.