కామెడీ కింగ్ ఎమోషనల్ టచ్

Sat Sep 24 2022 12:24:43 GMT+0530 (India Standard Time)

Kapil Sharma in Zwigato Movie

హిందీలో మంచి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకున్న కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అతని కామెడీ షో ఎంతగా పాపులర్ అయిందో కూడా అందరికీ తెలిసిందే. దాదాపు నేషనల్ ఇంటర్నేషనల్ టాప్ సెలబ్రిటీస్ అందరిని కూడా అతను ప్రత్యేకంగా తన షో కి కూడా పిలిచాడు. ఇక ఇప్పుడు అతను వెండితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యాడు.ఇంతకుముందే కొన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా కపిల్ శర్మకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఎక్కువగా అతను వెండితెరపై మాత్రమే మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక దర్శకురాలు నందితా దాస్ తెరకెక్కిస్తున్న "జ్విగాటో" అనే సినిమాతో అతను కీలక పాత్రలో నటించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం ఇదివరకే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రత్యేక ప్రదర్శనకు వెళుతోంది. ఈ చిత్రం ఫుడ్ డెలివరీ బాయ్‌ల కథతో కొనసాగుతుంది. Zwigato లోనే స్విగ్గీ మరియు జొమాటోల కాంబో అని ఈ టైటిల్ చెబుతుంది.

ఆమె టైటిల్ ద్వారానే ఎలాంటి కంటెంట్‌ను అందించారో ఊహించవచ్చు. ఇక ప్రత్యేకించి కపిల్ శర్మ తన కామెడీ జోక్‌ల ద్వారా కమెడియన్ గానే క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రేజ్ ఉన్న సమయాలలో నటనలో సరికొత్త మాడ్యులేషన్ యెహో ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా కపిల్ శర్మ నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. అతనిలో ఇంత ఎమోషనల్ టచ్ ఉందా అని కూడా కామెంట్ చేస్తున్నారు.

అలాగే కొంతమంది ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. వారి నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.