'కపటధారి'ని కమ్మేసిన ఉప్పెన

Tue Feb 23 2021 07:22:25 GMT+0530 (IST)

Kapatadhaari Movie Collections

సుమంత్ హీరోగా వచ్చిన కపటధారి సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దాంతో చాలా కాలం తర్వాత సుమంత్ కు ఒక కమర్షియల్ హిట్ పడ్డట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు భావించారు. కాని అనూహ్యంగా కపటధారి సినిమా కలెక్షన్స్ విషయంలో మరీ దారుణమైన లెక్కలు నమోదు అయ్యాయి. పాజిటివ్ టాక్ దక్కించుకున్న సినిమాకు మినిమం వసూళ్లు అయినా నమోదు అవ్వాలి. కాని సినిమా కు వసూళ్ల విషయంలో నిరాశ తప్పలేదు. టాక్ విషయంలో సుమంత్ నటన విషయంలో సోషల్ మీడియాలో పాజిటివ్ గా చెప్పుకుంటున్న జనాలు థియేటర్లకు వెళ్లి చూసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదని వసూళ్లను బట్టి అర్థం చేసుకోవచ్చు.కపటధారి వసూళ్లు మరీ వీక్ గా ఉండటానికి కారణం ఉప్పెన సినిమా కూడా అయ్యి ఉండవచ్చు అంటున్నారు. సూపర్ సెన్షేషనల్ ఉప్పెన సినిమా రెండవ వారంలో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఉప్పెనతో పాటు అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా కూడా ఒక మోస్తరు వసూళ్లను రాబట్టుకుంటూ కపటధారి పై పైచేయి సాధించినట్లు అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ రెండు సినిమాలు లేకుంటే ఖచ్చితంగా కపటధారికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఉండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాతో పాటు రీమేక్ అయిన తమిళ కపటధారి కమర్షియల్ గా కూడా సక్సెస్ దక్కించుకుంటే తెలుగు వర్షన్ కు మాత్రం నిరాశ మిగిలింది. సుమంత్ కు ఇంకా బ్యాడ్ టైమ్ కొనసాగుతున్నట్లుగా అనిపిస్తుందని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఆయన నటన కు మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి.