బైక్ యాక్సిడెంట్ తో నటుడి మృతి

Mon Jun 14 2021 13:17:13 GMT+0530 (IST)

Kannada actor Sanchari Vijay Raod Accident

కన్నడ సినీ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యిన విషయం తెల్సిందే. ఆయన బెంగళూరులోనే ఉండే తన స్నేహితుడి ఇంటికి బైక్ మీద వెళ్లి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ చేశారు. రెండు రోజులుగాఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉందని వైధ్యులు వెళ్లడిస్తూ వచ్చారు. విజయ్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మృతి చెందినట్లుగా వైధ్యులు ప్రకటించారు.బైక్ వేగంగా వస్తున్న సమయంలో యాక్సడెంట్ జరగడంతో తలకు బలమైన గాయం అయ్యిందట. అంతే కాకుండా కాళ్లు మరియు చేతులకు కూడా గాయాలు అయ్యాయంటూ స్థానికులు చెబుతున్నారు. తల గాయం వల్ల ఆపస్మారక స్థితిలో ఉన్నాడని.. కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందంటూ సదరు ఆసుపత్రి వైధ్యులు తెలిపారు. తలకు బలమైన దెబ్బతో బ్రెయిన్ లో రక్త సరఫరా నిలిచి పోయిందట. అందుకు సంబంధించిన సర్జరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. సర్జరీ ఏర్పట్లు జరుగుతున్న సమయంలోనే మృతి చెందినట్లుగా కన్నడ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అతడి ఆరోగ్య పరిస్థితిని బట్టి తల ఆపరేషన్ ఉంటుందని కూడా వైధ్యులు చెప్పారు. ఆపరేషన్ నిర్వహించాలని భావిస్తున్న సమయంలో తుది శ్వాస విడిచాడట. వర్మ తెరకెక్కించిన కిల్లింగ్ వీరప్పన్ మొదలుకుని ఎన్నో కన్నడ సినిమాల్లో నటించి మెప్పించిన సంచారి విజయ్ మృతిపై కన్నడ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు.