సింపథీ కోసం గేమ్ ఆడుతున్న క్వీన్

Tue Nov 30 2021 06:00:01 GMT+0530 (IST)

Kangana wisely plans to hit Sympathy

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో హైలైట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పద్మ అవార్డు దక్కించుకున్న నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను అవార్డుని వెనక్కి తీసుకోవాలని నెటిజనులు ప్రత్యర్థి నాయకులు మండిపడ్డారు. స్వాతంత్య్రకారులపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో  కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. బీజేపీకి మద్ధతుగా భజన కార్యక్రమం మొదలు పెట్టిందని విమర్శలు మూటగట్టుకుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే ఆమె వ్యక్తి గత జీవితాన్ని ఉద్దేశింశి ఆమె ఇన్ స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు అందరినీ బాధకు గురి చేస్తోంది.``నీ కోసమే నేను జీవించాను. కానీ నువ్వు నాతో అన్యాయంగా ప్రవర్తించావు`` అని కంగన ఇన్ స్టాలో వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో నిలిచింది. ఆమె లవ్ బ్రేకప్ వార్తని తెలుస్తోంది. ప్రేమలో విఫలమై ఇలా బాధపడుతుందని నెటి జనులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ కి కొన్ని రోజుల ముందు నాకు తల్లి కావాలని ఉంది. నేను చేసుకోబోయేవాడిని మీ అందరికీ పరిచయం చేస్తాను అని పేర్కొంది. మరి ఈ రెండు పోస్టులకు అసలు మీనింగ్ ఏంటి? అన్నది క్లారిటీ రావాలి. ఆమె వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో విషయాన్ని డైవర్ట్ చేయడానికి కంగన ఇలా సింపథీ కోసం ట్రై చేస్తుందా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

నిత్యం నెపోటిజంపై గొంతెత్తే కంగన నోట ఇలాంటి వ్యాఖ్యలు నమ్మశక్యమా? అని కొందరు నెటిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్వాతంత్య్ర ఉద్యమ కారులపై చేసిన వ్యాఖ్యల నుంచి నెటిజనుల్ని  డైవర్ట్ చేయడానికే ఇలాంటి పథకం వేసిందని కొందరు బాహాటంగానే అంటున్నారు. మరి అసలు సంగతి ఏంటి? అన్నది తేలాలి. ఇక కంగన సినిమాల విషయానికి వస్తే ధాకడ్..తేజస్ చిత్రాల షూటింగ్ ని పూర్తిచేసింది. టికు వెడ్స్ షేర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది.