Begin typing your search above and press return to search.

ట్విట్ట‌ర్ వాళ్ల‌ను తెల్లోళ్ల‌తో పోల్చి తిట్టేసిన కంగ‌న‌

By:  Tupaki Desk   |   4 May 2021 11:30 AM GMT
ట్విట్ట‌ర్ వాళ్ల‌ను తెల్లోళ్ల‌తో పోల్చి తిట్టేసిన కంగ‌న‌
X
నాలుక‌ను అదుపులో పెట్టుకోవాలని అంటారు. ఆ రూల్ ని ఎప్పుడో బ్రేక్ చేసారు కంగ‌న‌. తాను ఏమ‌నుకుంటుందో దానిని సూటిగా అనేయ‌డ‌మే త‌న విధానం. దానికి అల‌వాటు ప‌డ‌లేక‌పోతే అది అవ‌తలి వాళ్ల క‌ర్మ‌.

ట్విట్ట‌ర్ స‌హా సోష‌ల్ మీడియాల్లో కంగ‌న ఫైరింగ్ నిరంత‌రం వివాదాల‌కు తావిస్తున్న సంగ‌తి తెలిసినదే. తాజాగా మ‌రోసారి బెంగాళ్ ఎన్నిక‌ల వేళ కంగ‌న నోటి దురుసు చిక్కులు తెచ్చి పెట్టింది. త‌న‌కు న‌చ్చిన విధంగా నోటికి ప‌ని చెప్ప‌డంతో నిబంధ‌న‌ల్ని ప‌దే ప‌దే ఉల్లంఘించారు అంటూ శాశ్వ‌తంగా ట్విట్ట‌ర్ ఖాతా సస్పెండ్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.

అయితే దీనికి కంగ‌న సైలెంట్ గా ఉందా.. అంటే అలాంటిదేమీ లేదు. తాను న‌టించే తన సినిమాల్లో.. ఇత‌ర మార్గాల్లో తన స్వరాన్ని పెంచడానికి ఇతర వేదికలను కలిగి ఉన్నాన‌ని కంగ‌న వెల్ల‌డించారు.

కంగనా ఒక వీడియోను పంచుకోగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత పశ్చిమ బెంగాల్ లో జరిగిన హింసాకాండపై ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. ``మాటలకు మించి బాధపడటం.. ప్రజాస్వామ్యం మరణం.. మన ప్రభుత్వానికి ముఖ్యమైన సందేశం # బెంగాల్ బర్నింగ్ # బెంగాల్ హింస`` అంటూ వ్యాఖ్యానం జోడించారు.

దీంతో ట్విట్ట‌ర్ బ్యాన్ విధించింది. ఆ వెంట‌నే స్పందించిన కంగ‌న‌ ట్విట్టర్ ప్ర‌తినిధుల‌పై పంచ్ లు విసిరింది. ట్విట్ట‌ర్ వాళ్లంతా అమెరికన్లు అనే నా అభిప్రాయాన్ని నిరూపించారు. పుట్టుకతో ఒక తెల్ల వ్యక్తి గోధుమ రంగును బానిసలుగా చేసుకునే అర్హత కలిగి ఉన్నాడు. వారు ఏం ఆలోచించాలో.. ఏం మాట్లాడాలో ఏం చేయాలో మ‌న‌కు చెప్పాలనుకుంటున్నారు`` అని ఘాటుగానే విమ‌ర్శించారు.

అదృష్టవశాత్తూ.. నా సొంత కళతో నా స్వరాన్ని సినిమా రూపంలో పెంచడానికి నేను చాలా ప్లాట్ ఫారమ్ లను కలిగి ఉన్నాను. కానీ వేలాది సంవత్సరాలుగా హింసించబడిన.. బానిసలుగా .. సెన్సార్ చేయబడిన ఈ దేశ ప్రజలకు బాస‌ట‌గా నా హృదయం క‌ద‌న‌రంగంలోకి దిగుతుంది అని కంగ‌న వ్యాఖ్యానించారు.