Begin typing your search above and press return to search.

పీసీ Vs క‌ర‌ణ్‌! సినీ మాఫియాపై కంగ‌న వీరంగం!!

By:  Tupaki Desk   |   28 March 2023 7:40 PM GMT
పీసీ Vs  క‌ర‌ణ్‌! సినీ మాఫియాపై కంగ‌న వీరంగం!!
X
బాలీవుడ్ లో రాజకీయాలపై ప్రియాంక చోప్రా ప్రకటనపై కంగనా రనౌత్ తాజాగా స్పందించారు. కరణ్ జోహార్ `అసహ్యకరమైన - విషపూరితమైన వ్యక్తి` అని కంగ‌న సూటిగా నిందించారు. అత‌డి రాజ‌కీయాల వ‌ల్ల‌నే ప్రియాంక చోప్రా దేశం విడిచి వెళ్లింద‌ని ఫైర్ అయ్యారు.

త్వరలో సిటాడెల్ లో కనిపించనున్న ప్రియాంక చోప్రా తాజా ఇంట‌ర్వ్యూ ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. బాలీవుడ్ లో రాజకీయాలతో విసిగిపోయానని పీసీ ఈ ఇంట‌ర్వ్యూలో బాహాటంగా ప్ర‌క‌టించారు. బాలీవుడ్ లో తాను చేయాలనుకున్న ప‌లు ప్రాజెక్ట్ లలో నటించలేక‌పోయాన‌ని చెప్పింది. ఇక్క‌డ అవ‌కాశాలు పొందడం అంటే కొన్ని సమూహాలతో స్నేహం చేయడమేనని.. వారిలాగా గేమ్ ఆడడంలో తనకు నైపుణ్యం లేదని ప్రియాంక చోప్రా అన్నారు. తన మ్యూజిక్ వీడియో తర్వాత తాను విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని ప్రియాంక చోప్రా తెలిపింది. తాను బాలీవుడ్ లో చాలా కాలం పనిచేశానని.. కొత్త పచ్చిక బయళ్లను అన్వేషించడానికి వెనుకాడనని చెప్పింది. ఈ వ్యాఖ్యల అనంత‌రం పీసీకి మ‌ద్ధ‌తుగా `ఫ్యాష‌న్` మూవీ కొలీగ్ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించింది.

కరణ్ జోహార్ మాఫియాలా షో మొత్తం నడుపుతున్నందున ప్రతిభావంతులైన బయటి వ్యక్తులకు అవకాశాలు రావడం లేదని కంగ‌న మ‌రోసారి ఫైర్ అయ్యారు. కంగ‌న వ‌రుస‌ ట్వీట్లతో క‌ర‌ణ్ అండ్ మాఫియాపై చెల‌రేగారు. నిజానికి ప్రియాంక చోప్రా తన ఇంటర్వ్యూలో ఎవరి పేరును ప్ర‌స్థావించ‌క‌పోయినా కంగనా రనౌత్ సూటిగా క‌ర‌ణ్ జోహార్ పేరును ప్ర‌స్థావించారు.

కంగ‌న వ‌ర‌స ట్వీట్ట సారాంశం ఇదీ...

బాలీవుడ్ గురించి చెప్పాలంటే.. ప్రజలు ఆమె(పీసీ)పై గ్యాంగ్ అప్ అయ్యారు. ఆమె(పీసీ)ను బెదిరించారు. ఆమెను సినిమా పరిశ్రమ నుండి తరిమికొట్టారు! ఒక స్వయం నిర్మిత మహిళ భారతదేశం వదిలి వెళ్ళేలా చేసింది ఈ గ్యాంగ్. కరణ్ జోహార్ ఆమె(పీసీ)ను నిషేధించాడని అందరికీ తెలుసు..

షారూఖ్ తో ప్రియాంక స్నేహం.. అప్ప‌టికే ఆమె కరణ్ జోహార్ తో విభేదించడం గురించి మీడియా విస్తృతంగా రాసింది. ఎప్పుడూ త‌న‌కు హాని కలిగించ‌ని బయటి వ్యక్తుల కోసం వెతికే PC లో ఒక క‌చ్చితమైన ఎదురు తిరిగే త‌త్వాన్ని చూసి.. భారతదేశం వదిలి వెళ్లేంత‌ వరకు ఆమెను ఈ ముఠా వేధించింది.

ఈ అసహ్యకరమైన.. నీచమైన విషపూరితమైన అసూయాప‌రుడైన‌ వ్యక్తి .... AB (అమితాబ్ వ‌చ్చ‌న్) లేదా SRK (షారూఖ్‌) కాలంలో బయటి వ్యక్తులతో ఎన్నడూ శత్రుత్వం లేని చలనచిత్ర పరిశ్రమ సంస్కృతిని పర్యావరణాన్ని నాశనం చేసినందుకు బాధ్యత వహించాలి. అతని గ్యాంగ్ - మాఫియా PR బయటి వ్యక్తుల(ప్ర‌తిభ‌)ను వేధించినందుకు దాడి చేసినందుకు బాధ్యత వహించాలి.

.. అంటూ కంగ‌న ట్విట్ట‌ర్ లో ఫైర‌య్యారు.

వివేక్ అగ్నిహోత్రి ప్ర‌శంస‌లు:

కంగనా రనౌత్ మ‌ద్ధ‌తు త‌ర్వాత పీసీ వెస్ట్ (హాలీవుడ్) లో కెరీర్ ను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై `కాశ్మీర్ ఫైల్స్` ద‌ర్శ‌క‌నిర్మాత వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. పీసీపై అత‌డు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ప్రియాంక చోప్రా 2015 టెలివిజన్ సిరీస్ క్వాంటికోలో నటించిన తర్వాత హాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా హ‌వా సాగించారు. అయితే అంతకు ముందు ఇన్ మై సిటీ- ఎక్సోటిక్ వంటి పాటలతో ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆర్టిస్ట్ కావడానికి ప్రయత్నించారు. అయితే కాలక్రమేణా పాశ్చాత్య దేశంలో తన నటనా జీవితంపై దృష్టి పెట్టి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో కష్టపడటం కంటే వేరే పరిశ్రమలో కెరీర్ ని నిర్మించాలనే పెద్ద అడుగు ఎందుకు వేయాలని నిర్ణయించుకుందో ప్రియాంక చోప్రా ఇటీవలి ఇంట‌ర్వ్యూలో వెల్లడించింది. ఆశ్చర్యకరంగా బాలీవుడ్ నుండి కంగనా రనౌత్ - వివేక్ అగ్నిహోత్రి వంటి ప్ర‌ముఖులు పీసీ పై ప్రేమను కురిపించారు. త‌న ప్ర‌య‌త్నాలను ప్ర‌శంసించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.