Begin typing your search above and press return to search.

చంద్రముఖి 2 కోసం బాలీవుడ్ క్వీన్?

By:  Tupaki Desk   |   30 Nov 2022 4:36 AM GMT
చంద్రముఖి 2 కోసం బాలీవుడ్ క్వీన్?
X
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హారర్ మూవీ చంద్రముఖి ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో మళ్లీ అదే కథకు సీక్వెల్ తీసుకురావాలి అని దర్శకుడు పీ. వాసు పదేళ్ల క్రితమే ప్రయత్నాలు చేశాడు. కానీ సరైన కథ సెట్ అవ్వకపోవడంతో దాదాపు అందరూ కూడా విషయాన్ని మర్చిపోయారు.

ఇక మళ్ళీ ఇన్నాళ్లకు దర్శకుడు సీక్వెల్ కథను తెరపైకి తీసుకు వస్తున్నాడు. అయితే ఈసారి సూపర్ స్టార్ రజినీకాంత్ కాకుండా డాన్స్ కొరియోగ్రాఫర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్నాడు.

చంద్రముఖి 2 షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలం అయినప్పటికీ కూడా మధ్యలో కొన్ని బ్రేకులు పడడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇటీవల హైదరాబాదులో మళ్ళీ ఈ సినిమాకు సంబంధించిన మరొక కొత్త షెడ్యూల్లో మొదలుపెట్టారు.

ఇక కీలక సన్నివేశాలు ముగిసిన అనంతరం మరో రెండు షెడ్యూల్ స్ఫూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ క్వీన్ కంగనా రనౌత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు ఇదివరకే ఆమెకు కథ గురించి చెప్పడంతో పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం.

అయితే ఈ విషయంలో ఆమె తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో కంగనా ఒకరు.

అయితే ఆమె నటించిన గత నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్లో నటిస్తే సౌత్ లో కొంత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా చేయడానికి ఆమె ఓప్పుకుంటుందో లేదో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.