Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   17 May 2022 1:30 PM GMT
స్టార్ కిడ్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్..!
X
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే కంగనా రనౌత్.. నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వీలుచిక్కినప్పుడల్లా బాలీవుడ్ స్టార్ హీరోలు మరియు స్టార్ కిడ్స్ మీద విమర్శలు చేసే కంగనా.. లేటెస్టుగా వారిపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది.

బాలీవుడ్ స్టార్ కిడ్స్ అందరూ ప్రేక్షకులకు ఉడకబెట్టిన కోడిగుడ్ల మాదిరి విచిత్రంగా కనిపిస్తారని.. చేత్తో కాకుండా ఫోర్క్ లు - కత్తులతో తినే అలవాటు ఉన్న వారికి ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారని కంగనా రనౌత్ ప్రశ్నించింది.

కంగనా ప్రధాన పాత్రలో నటించిన 'ధాకడ్' సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కంగనా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ కిడ్స్ పై విమర్శలు గుప్పించింది.

''ఇటీవల కాలంలో హిందీలో వచ్చే సినిమాల్లో చాలా వరకు బాలీవుడ్ స్టార్ కిడ్స్ కనిపిస్తున్నారు. వాళ్ళు చదువుల కోసం చిన్నప్పటి నుంచి విదేశాల్లో ఉంటారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన వాళ్లకి ఇక్కడి పద్ధతులు ఎలా తెలుస్తాయి?" అని కంగనా ప్రశ్నించారు.

''వాళ్ల భాష - ఆహరం అన్ని వేరుగా ఉంటాయి. వాళ్ల లుక్స్ కూడా భయంకరంగా.. ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటాయి. అలాంటప్పుడు ప్రేక్షకులు వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతారు'' అని కంగనా తనదైన శైలిలో బాలీవుడ్ స్టార్ కిడ్స్ పై సెటైర్లు వేసింది.

బాలీవుడ్ మరియు సౌత్ కి మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడుతూ.. ''దక్షిణాదిలో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తున్నారు. సౌత్ హీరోలు ఎలాంటి పాత్రల్లోనైనా నటించడానికి ఆసక్తి చూపిస్తారు. ఉదాహరణకి ఇటీవల వచ్చిన 'పుష్ప' సినిమాలో హీరో కూలీ పని చేసే వ్యక్తిగా కనిపించాడు. కానీ బాలీవుడ్ హీరోలు అలా చేస్తారా?'' అని కంగనా ప్రశ్నించింది.

దక్షిణాది సినిమాలు సక్సెస్ కావడానికి కారణం అవి నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉండటమే అని కంగనా పేర్కొంది. సౌత్ సినిమాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలకు విలువ ఇస్తారని.. అందుకే ఆ సినిమాలు దేశంలోని అన్నీ రకాల ప్రేక్షకులకి కనెక్ట్ అవుతున్నాయని అభిప్రాయ పడింది.

కంగనా గతంలో కూడా అనేకసార్లు నెపోటీజం - ఫేవరిజం మీద మాట్లాడుతూ బాలీవుడ్ పై విరుచుకుపడింది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలే హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లను ఎదగనివ్వరని కంగనా ఆరోపించింది.