Begin typing your search above and press return to search.

సెకండ్ లుక్‌: అచ్చంగా అమ్మ ప్ర‌తిరూపం

By:  Tupaki Desk   |   24 Feb 2020 6:30 AM GMT
సెకండ్ లుక్‌: అచ్చంగా అమ్మ ప్ర‌తిరూపం
X
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత 72వ జయంతి సందర్భంగా `తలైవి` కొత్త లుక్ నేడు రిలీజైంది. నలుపు - ఎరుపు బార్డ‌ర్ తో తెల్లని చీరలో ఉన్న కంగన రూపం.. జయలలిత తన 30 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించిన‌ప్ప‌టి ఈ గెట‌ప్ ప్ర‌స్తుతం అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. కంగనా రనౌత్ బృందం సెకండ్ లుక్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఈ సినిమాలో సూపర్ స్టార్ స్టాట‌స్ నుండి రెబ‌ల్ పొలిటీషియ‌న్ గా ఎదిగిన అమ్మ‌ ప్రయాణాన్ని తెర‌పై చూపించ‌నున్నారు. తాజాగా అమ్మ జ‌య‌ల‌లిత పాత ఫోటోతో ఈ లుక్ ని పోల్చి చూస్తున్న అభిమానులు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కంగ‌న అచ్చం అమ్మ‌నే త‌ల‌పిస్తోంద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

నిజానికి కంగ‌న ఫ‌స్ట్ లుక్ రిలీజైన‌ప్పుడు అస‌లు ఏమాత్రం పోలిక లేద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే అమ్మ జ‌య‌ల‌లిత లేట్ ఏజ్ బొద్దుత‌నాన్ని ప్రోస్థ‌టిక్స్ లో చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డం తో అది సెట్ కాలేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. అయితే తాజా లుక్ కి అందుకు భిన్నంగా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

ఇందులో గ్లామర్- ప్రేమ-పోరాటం- స‌క్సెస్ అనే కోణాల్లో అమ్మ జీవితాన్ని చూపించ‌నున్నారు. నాన్న ఫేం ఏ.ఎల్.విజ‌య్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిందీ- తమిళం- తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. అరవింద్ స్వామి- జిషు సేన్ గుప్తా- ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందురి- శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. 2020 జూన్ 26న సినిమా థియేటర్లలోకి రానుంది.