Begin typing your search above and press return to search.

రోజుకు 50ల‌క్షలు.. ఇంతేనా కంగ‌న పెతాప‌మూ!?

By:  Tupaki Desk   |   23 May 2022 5:33 AM GMT
రోజుకు 50ల‌క్షలు.. ఇంతేనా కంగ‌న పెతాప‌మూ!?
X
మాట‌లు కోట‌లు దాటించేయ‌డ‌మెలానో.. ఏదేదో జ‌రిగిపోబోతోంద‌ని భ్ర‌మింప‌జేయ‌డ‌మెలానో.. అయినదానికి కానిదానికి ఊక‌దంపుడు ప్ర‌చారం సాగించ‌డ‌మెలానో.. వివాదంతో ప్ర‌చారం గుంజుకోవ‌డ‌మెలానో.. మ‌న‌ ఆర్జీవీని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు అత‌డికి వార‌సురాలిగా వెలిగిపోతోంది బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్. బాలీవుడ్ లో అత్యంత వివాదాస్ప‌దురాలిగా పాపుల‌రైన కంగ‌న‌ యూనిక్ స్టైల్ తో వ‌రుస‌గా నాయికా ప్ర‌ధాన చిత్రాల‌తో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

త‌న‌ను తాను సూప‌ర్ ఉమెన్ గా ప్ర‌క‌టించుకునేందుకు ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌ని కంగన ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపుల‌తో గిల‌గిల‌లాడుతోంది. ఎన్నో హోప్స్ పెట్టుకున్న త‌లైవి ఆశించిన విజ‌యం ద‌క్కించుకోలేదు. ఈ సినిమా త‌న‌కు పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని తెస్తుంద‌ని ఆశిస్తే అస‌లు ఆడిందో లేదో కూడా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న లేకుండా పోయింది. ఇంత‌కుముందు వ‌చ్చిన `మ‌ణిక‌ర్ణిక` రిజ‌ల్ట్ కూడా అంతంత మాత్ర‌మే. ఇప్పుడు భారీ స్టంట్స్ ర‌క్త‌పాతం నేప‌థ్యంలో హ్యూమ‌న్ ట్రాఫికింగ్ కాన్సెప్టుతో తెర‌కెక్కిన ధాక‌డ్ మూవీ రిజ‌ల్ట్ కూడా కంగ‌న‌ను అంతే తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

ధాక‌డ్ ఇటీవ‌లే కార్తిక్ ఆర్య‌న్ న‌టించిన భూల్ భుల‌యా 2తో పోటీప‌డుతూ అదే రోజు విడుద‌లైంది. కానీ భూల్ భుల‌యా 2 హిట్ టాక్ తెచ్చుకోగా ధాక‌డ్ కి యునానిమ‌స్ గా ఫ్లాప్ టాక్ వ‌చ్చింది. ధాక‌ర్ రోజుకు రూ.50 ల‌క్ష‌లు మించి వ‌సూలు చేయ‌లేక‌పోయింది. ఓపెనింగ్ డే తో పాటు `ధాక‌డ్` బాక్సాఫీస్ అంచనా రెండో మూడో రోజు కూడా రూ.50 ల‌క్ష‌ల‌కు మించ‌లేదు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ వ‌సూళ్ల‌లో ఎటువంటి పెరుగుదల లేదని ట్రేడ్ చెబుతోంది.

కంగనా రనౌత్ యాక్షన్ థ్రిల్లర్ ధాకడ్ కి ఇక ఛాన్సే లేదు.. ఎందుకంటే ఈ చిత్రం శనివారం కూడా కలెక్షన్లలో వృద్ధిని చూపలేదు. నిజానికి రెండో రోజు ప్రేక్షకులు రాకపోవడంతో అనేక థియేట‌ర్ల నుంచి షోలు రద్దయ్యాయి. ఈ చిత్రం రూ. రెండో రోజు 50 లక్షలు మూడో రోజు మ‌రో 50ల‌క్ష‌లు క‌లుపుకుని రూ. 1.5 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింద‌ని చెబుతున్నారు. ఇది నిజంగా కంగ‌న టీమ్ ని నిరాశ‌ప‌రిచిన అంశం.

కంగ‌న ధాక‌డ్ కి ప్రేక్షకులు లేకపోవడానికి కార‌ణం హారర్ కామెడీ `భూల్ భూలయ్యా 2`కి విపరీతమైన డిమాండ్ ఉండ‌డం కూడా ఒక కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఆదివారం నుండి ధాకడ్ షోలను ఎగ్జిబిటర్లు భూల్ భుల‌యా 2తో భర్తీ చేయడం ప్రారంభించారు. ధాక‌డ్ చిత్రం డిజాస్టర్ కావడంతో మేము జీవితకాల గణాంకాలు 3 కోట్ల మార్క్ ని తాక‌డం కూడా క‌ష్ట‌మ‌ని విశ్లేషిస్తున్నారు. 5-8 శాతం మ‌ధ్య‌లో ఆక్యుపెన్సీతో కంగ‌న సినిమా ప్రారంభ‌మైందంటే ఎంత‌టి దారుణ స‌న్నివేశాన్ని ఎదుర్కొందో అంచ‌నా వేయొచ్చు. ఇక తెలుగు బెల్ట్ లో మ‌ల్టీప్లెక్సుల్లో విడుద‌లైనా కానీ అస‌లు ధాక‌డ్ కి ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. థియేట‌ర్లు వెల‌వెల‌బోయాయి.

రీజ‌న్ ఏదైనా కానీ సినిమాలో అస‌లు కంటెంట్ లేదు. స్క్రీన్ ప్లే అస‌లే లేద‌న్న బ్యాడ్ టాక్ వ‌చ్చింది. దీంతో జ‌నం థియేటర్ల వైపు వెళ్ల‌లేదు. వాటాదారులందరికీ భారీ నష్టాన్ని కలిగించే ప్రాజెక్ట్ గా ముగుస్తుంది. ఇది ఒక డార్క్ యాక్షన్ థ్రిల్లర్ .. దీనికోసం పెట్టిన‌ బడ్జెట్ కు ఎప్పుడూ హామీ క‌నిపించ‌లేదు. రిజానికి లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేట‌ర్ల‌కు జ‌నాల్ని తీసుకువస్తుందని మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా భావించారు. ఈ చిత్రం హిందీ చిత్ర పరిశ్రమ నుండి పాండమిక్ అనంతర అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌ జాబితాలో చేరింది.

తాజా రిజ‌ల్ట్ తో ప్ర‌తి వేదిక‌పైనా ఆర్భాటంగా అన్ని క‌బుర్లు చెప్పే కంగ‌న ర‌నౌత్ నుంచి ఇలాంటి సినిమా వ‌స్తుందా? అంటూ అంతటా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. ర‌నౌత్ ఇలాంటి చెత్త సినిమాలో న‌టించాల్సింది కాద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. నిజానికి ఈ చిత్రంలో కంగ‌న న‌ట‌న యాక్ష‌న్ స‌న్నివేశాలు బావున్నా కానీ ద‌ర్శ‌క‌త్వ ఫెయిల్యూర్ ఇబ్బందిపెట్టింద‌ని కూడా ముచ్చ‌ట సాగింది. ఇక‌పై అయినా కంగ‌న ఎంపిక‌ల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల‌ని ప‌లువురు ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు.