'బాలీవుడ్ లో అబ్బాయిలపై కూడా లైంగిక దాడులు జరుగుతాయి'

Mon Sep 21 2020 20:00:22 GMT+0530 (IST)

'Boys are also assaulted in Bollywood'

'ఊసరవెల్లి' హీరోయిన్ పాయల్ ఘోష్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పాయల్ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ 'ఒకసారి అనురాగ్ కశ్యప్ ని కలవడానికి వెళ్తే తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. లైంగిక వేధింపులకు గురి చేసాడని' చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పటివరకు అందరూ బాలీవుడ్ లో డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటుంటే.. ఇప్పుడు పాయల్ ఘోష్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదానికి తెర తీశారు. ఈ వివాదంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. అనురాగ్ కశ్యప్ ని అరెస్ట్ చేయాలని హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ తనకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను వెల్లడించింది."పాయల్ ఘోష్ ఏదైతే చెప్పిందో పెద్ద హీరోల వల్ల అలాంటి పరిస్థితిని నేను కూడా ఎదుర్కొన్నాను. వారి వ్యాన్ లేదా రూమ్ డోర్ లాక్ అయినప్పుడో లేదా పార్టీలోనో లేదా ఫ్రెండ్లీగా డాన్స్ చేసే సమయంలోనో వారి జననేంద్రియాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. మన నోట్లో వారి నాలుకను అతికించడానికి ప్రయత్నిస్తారు. వర్క్ ఉందని మన అపాయింట్‌మెంట్ తీసుకుని ఇంటికొస్తారు. మనల్ని బలవంతం చేయడానికి ట్రై చేస్తారు. బుల్లీవుడ్ లైంగిక వేటగాళ్లతో.. నకిలీ మనుషులతో మరియు నకిలీ వివాహాలను చేసుకునేవారితో నిండిపోయింది. వారు ప్రతిరోజూ ఒక కొత్త యంగ్ హాట్ గర్ల్ వారిని సంతోషపరచాలని కోరుకుంటారు. వారు యువ పురుషులకు కూడా అదే చేస్తారు. నాకు #MeToo అవసరం లేదు కాబట్టి నాకు నేను పరిష్కరించుకున్నాను. నాకు తెలిసినంత వరకు అనురాగ్ కశ్యప్ ఏకపత్నీవ్రతుడిగా ఉండలేదు. తను చాలా పెళ్లిళ్లు చేసుకున్నాడు. పాయల్ తో అనురాగ్ ఎలా ప్రవర్తించాడో అది బాలీవుడ్ లో సాధారణంగా జరిగే విషయమే. ఇండస్ట్రీలోని అవుట్ సైడర్స్ అయిన అమ్మాయిలను సెక్స్ వర్కర్స్ గా భావించి ఇబ్బందులకు గురి చేస్తుంటారు" అని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది.