కంగనను దూరం పెట్టకపోతే వీధిలో ఇళ్లన్నీ కూల్చేస్తామని వార్నింగ్!

Tue Sep 29 2020 23:01:40 GMT+0530 (IST)

Warning that all the houses on the street will be demolished if Kangana is not removed!

నా ఇరుగు పొరుగును బెదిరించి నన్ను సామాజికంగా దూరం చేయమని వార్నింగులు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేసింది క్వీన్ కంగన. తాజాగా తన ట్విట్టర్ లో బ్రిహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) తన పొరుగువారందరికీ నోటీసులు అందించిందని వెల్లడించారు.``బీఎంసీ నా పొరుగువారందరికీ నోటీసులు ఇచ్చింది. నన్ను సామాజికంగా వేరుచేయమని బెదిరించింది. ఇరుగు పొరుగు నాకు మద్దతు ఇస్తే వారి ఇళ్లను కూడా విచ్ఛిన్నం చేస్తారని హెచ్చరించింది.. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పొరుగువారు ఏమీ అనలేదు.. దయచేసి వారి ఇళ్లను విడిచిపెట్టండి`` అంటూ కంగన ట్వీట్ చేయడం కలకలం రేపింది.

అయితే ఓ ఇంటర్వ్యూ లో కంగనా రనౌత్ ను బెదిరించారని.. లేదా అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణన్ని సంజయ్ రౌత్ ఖండించారు. బిఎంసి ఇటీవల ఆమె పాలి హిల్ కార్యాలయంలో కొంత భాగాన్ని కూల్చివేసింది. జరిగిన నష్టానికి కంగన రూ .2 కోట్లు డిమాండ్ చేసారు. కంగనా బొంబాయి హైకోర్టులో రీజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేసారు. అలాగే కూల్చివేత చట్టవిరుద్ధమని ప్రకటించాలని ఆమె డిమాండ్ చేసినట్లు బిఎంసి ఆరోపించింది.

కంగన కెరీర్ సంగతి చూస్తే..కంగనా చివరిసారిగా అశ్విని అయ్యర్ తివారీ ‘పంగా’ లో కనిపించారు. ఈ చిత్రంలో జాస్సీ గిల్ - రిచా చద్దా- నీనా గుప్తా కూడా ఉన్నారు. తరువాత.. దివంగత జె జయలలిత బయోపిక్ లో క్వీన్ నటిస్తోంది. ఈ చిత్రానికి ‘తలైవి’ అని పేరు పెట్టారు. ఇది కాకుండా.. ఆమె ఖాతాలో ‘కాకాస్’ .. ‘తేజస్’ అనే వేరే చిత్రాలు కూడా ఉన్నాయి.