మెగాస్టార్ కూడా వదలని లేడీ ఫైర్ బ్రాండ్

Thu May 12 2022 18:00:02 GMT+0530 (IST)

Kangana Ranaut On Amitabh Bachchan

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు కంగనా రనౌత్. ఈ అమ్మడు సినిమాల ద్వారా కంటే తన నోటి దురుసు.. దుడుకు స్వభావం వల్ల ఎక్కువ ఫేమస్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఉన్న వారసులు అంతా కూడా వేస్ట్ అనేది ఆమె అభిప్రాయం.. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో బాహాటంగానే చెప్పింది. ఇండస్ట్రీలో వారికి వెనుక ఎవరు లేకుండా ఉంటే అప్పుడు వారి ప్రతిభ ఏంటో తెలుస్తుందని స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడింది.రాజకీయంగా మరియు సినీ రంగంలో ఆమె చేసే వ్యాఖ్యలు ఆమెకు శత్రువులను పెంచడంతో పాటు ఆమె ఇమేజ్ ను కూడా పెంచాయి అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ అనే పేరుకు సరైన అర్థంగా ఆమె నిలుస్తుందని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. సీనియర్ స్టార్ హీరోలు.. యంగ్ స్టార్ హీరో హీరోయిన్స్ అందరు కూడా ఆమె తో పెట్టుకోవాలంటే ఒకింత భయపడుతారు.

ఆమె గురించి ఏదైనా మాట్లాడితే విరుచుకు పడటం ఆమె నైజం. అందుకే ఆమె కు సాధ్యం అయినంత దూరం ఉండటం లేదా ఆమె గురించి మాట్లాడకుండా ఉండటంకే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. తాజాగా కంగనా ధాకడ్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. త్వరలో విడుదల కాబోతున్న ధాకడ్ సినిమా నుండి షీ ఈజ్ ఆన్ ఫైర్ అనే పాట ప్రోమో ను విడుదల చేశారు.

ఆ పాట ప్రోమోను బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఏం జరిగిందో ఏమో కాని కొన్ని గంటల తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. అమితా బచ్చన్ తన ట్వీట్స్ ను డిలీట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ధాకడ్ సినిమా సాంగ్ ప్రోమోను డిలీట్ చేయడానికి కారణం ఏంటో అనేది మాత్రం క్లారిటీ లేదు.

అమితాబ్ ఆ ప్రోమోను డిలీట్ చేయడంపై కంగనా విరుచుకు పడింది. అమితాబచ్చన్ కు కూడా నేనంటే భయం వేసిందేమో. అందుకే నా పాట ప్రోమో ట్వీట్ ను డిలీట్ చేశారు. లేదంటే ఆయనపై ఎవరైనా ఒత్తిడి తీసుకు వచ్చి డిలీట్ చేయించి ఉండవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.

కంగనా ఇంకా స్పందిస్తూ.. బాలీవుడ్ లో నేను అంటే పడని వారు చాలా మంది ఉన్నారు. నాపై కక్ష కట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. వారికి నేను అంటే భయం.. వారికి నా వల్ల అభద్రత భావం ఉంది. అందుకే వారు నా విషయంలో ఎప్పుడు కూడా నెగటివ్ గా ఉంటున్నారంటూ కామెంట్స్ చేసింది. ఎప్పుడు స్టార్స్ పై విమర్శలు చేసే కంగనా ఈసారి ఏకంగా మెగాస్టార్ పై విమర్శలు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.