ఫోటో స్టొరీ: అందాలను వడ్డించిన కంగన

Tue Sep 10 2019 17:11:44 GMT+0530 (IST)

Kangana Ranaut Glamourous Pose

క్వీన్ కంగనా రనౌత్ కు బాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.  యాక్టింగ్ టాలెంట్ విషయంలో కంగనా ఇతర హీరోయిన్లకు అందనంత ఎత్తులో ఉంటుంది. ఇప్పటికే రెండు నేషనల్ అవార్డులను తన బ్యాగులో వేసుకుంది అంటే మనం కంగనా టాలెంట్ అర్థం చేసుకోవచ్చు.  స్క్రీన్ పైన తన యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసే కంగన రియల్ లైఫ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో చాలామందిని బెదరగొడుతూ ఉంటుంది.ఇక గ్లామర్ విషయంలో కూడా కంగనా ఎవరికీ తీసిపోదు. ఫిలిం ఫెస్టివల్స్ లో.. బాలీవుడ్ ఫిల్మీ ఫంక్షన్లలో కంగనా డ్రెస్సింగ్.. ఆ స్టైల్ చూస్తే ఎవరైనా థ్రిల్ అయిపోవాల్సిందే. అంతే కాదు.. కంగనా కనుక హాట్ ఫోటో షూట్ చేస్తే ఇక జనాలు మటాషే.  అయితే మిగతా హీరోయిన్లలా తనకు సోషల్ మీడియా ఖాతాలు లేవు.. అందుకే పెద్దగా డబ్బా కొట్టుకోదు. అయినా తన హాట్ ఫోటోలు బయటకు రాకుండా ఉండవు కదా.  అలానే రీసెంట్ గా కంగనా హాట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.   ఈ ఫోటోలలో కంగనా ఒక ఇంటర్నేషనల్ మోడల్ తరహాలో కనిపించింది.  పాప్ స్టార్స్ లాగా బ్లాక్ జాకెట్.. బ్లాక్ ప్యాంట్ ధరించి అంతకంటే స్టైలిష్ గా నిలుచుని పోజిచ్చింది.  బటన్స్ లేకపోవడంతో హాట్ నెస్.. స్పైసీనెస్ సబ్జెక్టులలో కంగనాకు 100 కు 100 మార్కులు వచ్చాయి.

ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎవరికైనా అనిపించేది ఒకటే కంగనాలో చాలా కోణాలు ఉన్నాయి.  అపరిచితుడు సినిమాలో విక్రమ్ టైపులో కంగనా కూడా సందర్భానికి తగినట్టు ఒక్కో వ్యక్తిని బయటకు తీస్తూ ఉంటుంది.  ప్రస్తుతానికి మాత్రం హాటు బ్యూటీని బయటకు తీసింది. ఇక కంగనా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వంలో 'పంగా' అనే చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమాతో పాటుగా దశరథ్ ఎం. మాలి దర్శకత్వంలో 'ధాకడ్' అనే మరో చిత్రంలో నటిస్తోంది.  జయలలిత బయోపిక్ 'తలైవి' లో కూడా నటిస్తోంది.  ఈ చిత్రానికి దర్శకుడు ఎఎల్ విజయ్.