Begin typing your search above and press return to search.

కంగనా రానౌత్ ఏ వంశానికి చెందిన అమ్మాయో తెలిస్తే షాకవుతారు

By:  Tupaki Desk   |   3 Dec 2021 11:30 PM GMT
కంగనా రానౌత్ ఏ వంశానికి చెందిన అమ్మాయో తెలిస్తే షాకవుతారు
X
సినిమా హీరోయన్ అంటే అందం, అభినయంతో పాటు కాస్త సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కంగనా రానౌత్ అలా.. కాదు అందం, అభినయం ప్రదర్శిస్తూనే మరో వైపు ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్నారు. ఘాటైన రాజకీయ విమర్శలు చేస్తూ.. ట్విట్టర్లో పోస్టులతో రచ్చ రచ్చ చేసే కంగనా రాజవంశ కుటుంబానికి చెందిన ఆడపిల్ల. ఆమె సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఓ పెద్ద కుటుంబంలో ఉండేది. కానీ ఇంట్లో వాళ్లతో గొడవపెట్టుకొని, ఇల్లు వదిలి బయటకు వచ్చిన కంగనా ఎన్నో కష్టలు పడింది. భోగభాగ్యాలు అనుభవించాల్సిన ఆమె పస్తులుండే రోజుల్లో గడిపింది. సినిమా మీద ఉన్న ప్రేమ ఆమెకు జీవితాన్ని నేర్పింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి ఉండే కంగనా రానౌత్ ఫ్యామిలీ బ్యాకరౌండ్ తెలిస్తే షాకవుతారు.

హిమచల్ ప్రదేశ్ కు చెందిన రాజపుత్ర రాణావత్ వంశంలో పుట్టింది కంగనా. ఆమె ముత్తాత సర్జూసింగ్ రాణావత్ 1951లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. తాత బ్రహం చంద్ రాణావత్ ఐఏఎస్ అధికారి, తండ్రి అమరదీఫ్ వ్యాపారస్తుడు. కంగనాది బాగా డబ్బున్న కుటుంబం అయితే ఆమెకు తన కుటుంబ సభ్యుల్లా ఉండడం ఇష్టం లేదు. సినిమాల్ల నటించాలన్న కోరిక ఉండేది. దీంతో ఆమె సినిమాల్లో నటిస్తానని కుటుంబ సభ్యులకు తెలిపింది. కానీ ఇంట్లో వాళ్లు అస్సలు ఒప్పుకోలేదు.

ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే కంగనా ఈ విషయంలో కూడా ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆమె ఇల్లు వదిలి బయటకు రావాల్సి వచ్చింది. అయితే ఇంట్లో నుంచి బయటకు వెళితే చిల్లి గవ్వ కూడా ఇవ్వలేమని తండ్రి చెప్పాడు. ఏమీ ఇవ్వకపోయినా వర్వలేదనిముంబయ్ కి చేరిందీ భామ. అయితే చేతిలో డబ్బుల కోసం కొన్ని రోజులు మోడలింగ్ చేసేంది. ఆ తరువాత నాటకాల్లో పాల్గొనేది. ఆ తరువాత మహేశ్ భట్ ను కలుసుకొని తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించాలని అడిగింది.

అప్పటికే మహేశ్ భట్ ‘గ్యాంగ్ స్టర్’ సినిమా ప్లాన్ వేస్తున్నాడు. అయితే ఆ సినిమా కోసం కంగనాను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అప్పటికీ కంగనా వయసు 17 ఏళ్లు మాత్రమే. మొదట ఇంత చిన్న అమ్మాయితో ఎలా చేయించాలి..? అని ఆలోచించారు. కానీ చివరికి ఆమెనే ఆ సినిమాలో హీరోయిన్ గా పెట్టారు. ఈ సినిమా విజయం సాధించడంతో కంగనా స్టార్ నటిగా మారింది. అయితే కటుుంబ సభ్యులకు ఆమె హీరోయిన్ అయిందని తెలియగానే తమ వంశానికి చెందిన ‘రాణావత్’ పేరును వాడుకోవద్దని ఆమె తాత హెచ్చరించారు. కానీ కంగనా అవేమీ పట్టించుకోలేదు. తనకిష్టమైన విధంగానే ఉంటుంది.

ఇటీవల ఆమె భారత్ కు 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కాదని, భిక్ష అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లోనే అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో కోర్టులో ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఆమె భారత్ లో అత్యంత శక్తివంతమైన మహిళ అని ఆమె ట్యాగ్ తగిలించి ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో పాటు రకరకాల కామెంట్లు వచ్చాయి. అయితే ఏ విషయాన్నైనా తడుముకోకుండా నేరుగా చెప్పే కంగనా ఈమధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు.