చరణ్ సినిమాని ఆపేసిన కమల్?

Mon Aug 15 2022 13:00:01 GMT+0530 (IST)

Kamal stopped Charan's movie?

జక్కన్న అత్యంత ప్రతి ష్టాత్మకంగా తెరక్కించిన 'RRR' ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టడంతో మెగా పవర్ స్టార్ మంచి ఊపులో వున్నారు. ఈ మూవీ అందించిన జోష్ తో వెంటనే ఎస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. భారీ హంగామా మధ్య ఈ మూవీని ప్రారంభించిన శంకర్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేస్తూ స్పీడు పెంచారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ని హైదరాబాద్ లో లాంఛనంగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తరువాత విశాఖపట్నం రాజమండ్రి అమృత్ సర్ వంటి తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ నిచేశారు. 1930 కాలం నాటి పీరియాడిక్ నేపథ్యానికి ప్రస్తుతం జనరేషన్ కి లింకప్ చేస్తూ ఈ మూవీని సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీ ఇప్పటి వరకు ఎంత శాతం షూటింగ్ జరుపుకుంది అన్న విషయంలో క్లారిటీ లేదు. చిత్ర వర్గాలు కూడా ఆ వివరాల్ని ఇంత వరకు ప్రకటించలేదు. జరిగినంత వరకు అయితే కీలక ఘట్టాలని మాత్రం శంకర్ పూర్తి చేశారని తెలిసింది. ఇదిలా వుంటే కమల్ హాసన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కి బిగ్ బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

కారణం దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత కమల్ హాసన్ విక్రమ్ తో బిగ్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ తో కమల్ మంచి జోష్ తో వున్నారు. ఈ టైమ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలని లైకా ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది.

కమల్ తో లైకా ప్రొడక్షన్స్ 'ఇండియన్ 2'ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భారీ క్రేజ్ యాక్సిడెంట్ తరువాత లైకాకు శంకర్ కు మధ్య ఏర్పడిన అభిప్రాయ భేధాలు ఆ తరువాత వారు కోర్టుని ఆశ్రయించడం తెలిసిందే.

ఈ వివాదాన్ని కమల్  పరిష్కరించి 'ఇండియన్ 2' తిరిగి పట్టాలెక్కేలా చేశారట. ఈ నేపథ్యంలో 'విక్రమ్' సూపర్ సక్సెస్ తరువాత 'ఇండియన్ 2'ని పట్టాలెక్కిస్తున్నారు. ఈ కారణంగానే రామ్ చరణ్ మూవీకి బిగ్ బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 'ఇండియన్ 2' పూర్తి చేసుకున్నాకే శంకర్ RC15 కోపం వస్తారట. ఈ లోగా చరణ్ మరో ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి సినిమాని త్వరలో పట్టాలెక్కించే అవకాశం వుందని తెలిసింది. ఈ మూవీని యువీతో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నారు.