Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఈ వయసులోనూ అదే సూపర్ స్టైల్‌

By:  Tupaki Desk   |   1 Feb 2023 10:24 AM GMT
పిక్ టాక్ : ఈ వయసులోనూ అదే సూపర్ స్టైల్‌
X
యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఏడు పదుల వయసుకు చేరువ అయ్యాడు. ఈ వయసులో కూడా కమల్‌ చాలా యాక్టివ్ గా కనిపించడంతో పాటు చాలా స్టైల్‌ గా కనిపిస్తున్నారు అంటూ ఈ ఫోటో చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫొటో ఇండియన్ 2 సెట్స్ నుండి బయటకు వచ్చింది.

తిరుపతి పరిసర ప్రాంతాల్లో కమల్‌ హాసన్‌.. శంకర్ ల ఇండియన్ 2 చిత్రీకరణ జరుపుతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కమల్‌ ఈ వయసులో కూడా షూటింగ్‌ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతూ ఉన్నారు.

ఇదే సమయంలో ఇండియన్ 2 సెట్స్ నుండి కమల్ హాసన్ యొక్క ఈ సూపర్‌ స్టైల్‌ కూల్‌ లుక్‌ ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కమల్‌ ఫిజిక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ 30 ఏళ్ల వయసు తగ్గించి చూపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇండియన్ 2 కొన్ని వివాదాల కారణంగా నిలిచిపోయిన.. పెద్ద మనుషుల వద్ద కుదిరిన రాజీ తో మళ్లీ మొదలు అయిన విషయం తెల్సిందే. ఒక వైపు చరణ్ సినిమాను చేస్తూనే మరో వైపు శంకర్‌ ఈ సినిమాను పూర్తి చేసే పని మొదలు పెట్టాడు.

మరికొన్ని రోజుల్లో ఇండియన్ 2 ను ముగించే అవకాశాలు ఉన్నాయి అని తమిళ మీడియా సర్కిల్స్ నుండి సమాచారం అందుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.