కమల్ హాసన్ ట్రెండీ లుక్.. అదిరిందిగా!

Mon Jan 23 2023 11:00:02 GMT+0530 (India Standard Time)

Kamal Hassan New Trendy Look

ఆరు పదుల వయసులోనూ కమల్ హాసన్ తన్ లుక్స్ తో ఎప్పుడూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. మూడున్నరేళ్ల వయసులోనే బాల నటుడిగా తెరపై మెరిసిన విలక్షణ నటుడు కమల్ హాసన్.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 68 ఏళ్లలోనూ తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు. తన అందం అభినయంతో ఇప్పటికీ తన క్రేజ్ ను పెంచుకుంటూనే పోతున్నాడు. కేవలం సినిమాల్లోనే కాకుండా బిగ్ బాస్ షోలో కూడా యాంకర్ గా చేస్తూ దుమ్మరేపుతున్నారు.తమిళ బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా కమలే యాంకర్ గా చేశారు. అయితే 2022 అక్టోబర్ 9న ప్రారంభమైన ఈ షో నిన్నటితో పూర్తయింది. ఈ షోలో కమల్ స్టేజీపై కనిపించిన ప్రతీసారి సరికొత్త ఔట్ ఫిట్ తో దర్శనమిచ్చారు.

రోజుకో రకమైన ట్రెండీ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఫినాలే కోసం మరింత గ్లామరస్ గా తయారయ్యారు. బ్లూ కలర్ కోట్ అండ్ జీన్స్ విత్ వైట్ పెయింట్... లోపల వైట్ షర్ట్ వేసుకొని సరికొత్త లుక్ లో కనిపించారు.

కూలింగ్ గ్లాసెస్ తో పాటు యాష్ అండ్ బ్లాక్ షూస్ వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. కమల్ హాసన్ కు రోజురోజుకూ వయసు తగ్గుతోందని పలువురు కామెంట్లు చేయగా.. వయసు పెరుగుతున్నా కొద్దీ గ్లామర్ కూడా పెరుగుతుందంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ చివరి ఎపిసోడ్ మొన్నే పూర్తి కాగా.. రెండ్రోజుల క్రితం కమల్ తిరుపతి వెళ్లారు. ఇండియన్ 2 సినిమా షూటింగ్ కోసమే ఆయన అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చెన్నైలో కొన్ని షెడ్యూల్స్ పూర్తవగా.. తాజాగా తిరుపతి చిత్రీకరణ జరుగుతోంది.

కమల్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ సినిమా తెలుగులో భారతీయుడు పేరుతో రిలీజై సంచలనం సృష్టించింది. కోట్లలో కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాలో కమల్ డ్యుయెల్ రోల్ ఫోషించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇండియన్ 2 సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నమోదు అయ్యాయి.  నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.