అక్షర కి ఏమైనా పని అవుద్దా..!

Thu Aug 18 2022 05:00:01 GMT+0530 (IST)

Kamal Hassan Daughter Akshara Hassan

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కూతుర్లు ఇద్దరు కూడా మల్టీ ట్యాలెంటెడ్ అనడంలో సందేహం లేదు. శృతి హాసన్ ఒక వైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు సంగీత దర్శకురాలిగా.. సింగర్ గా.. ఫ్యాషన్ డిజైనర్ గా కూడా చేస్తూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శృతి హాసన్ కెరీర్ లో సక్సెస్ అయినంతగా ఆమె సోదరి.. కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ సక్సెస్ అవ్వలేక పోయింది.అక్షర హాసన్ నటిగా కాకుండా మొదట సహాయ దర్శకురాలిగా కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కెరీర్ ప్రారంభించి చాలా సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఒక మంచి కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది.

అక్షర హాసన్ నటిగా ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు నటిగా మంచి పేరు తెచ్చి పెట్టాయి కాని కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేదు.

నటిగా అక్షర హాసన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హీరోయిన్ గా ఆఫర్ల కోసం సోషల్ మీడియా ద్వారా హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ ఉంది. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు అక్షర షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు ఆమె రేంజ్ ను బాగా పెంచేస్తున్నాయి అంటున్నారు. ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తే ముందు ముందు భారీ ఎత్తున కమర్షియల్ సినిమాల్లో ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్న అక్షర హాసన్ కి అడపా దడపా ఆఫర్లు వస్తున్నాయి. స్కిన్ షో చేస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన తాజా ఫోటోల కారణంగా ఈ అమ్మడికి బాలీవుడ్ నుండి పిలుపు ఏమైనా వెంటనే వస్తుందేమో చూడాలి.

అక్షర హాసన్ తన సోదరి శృతి హాసన్ మాదిరిగా కమర్షియల్ హీరోయిన్ గా పేరు దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. మరి అక్షర కి ఇలా అయినా పని అయ్యేనా చూడాలి.