గుజరాతీ పాఠాలు నేరుస్తున్న సేనాపతి

Tue Nov 19 2019 15:47:51 GMT+0530 (IST)

Kamal Haasan speaks Gujarati in Indian 2

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్.. శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఇండియన్ 2' చిత్రం కాస్త మెల్లగా చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది చివరకు వరకు సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇండియన్ సినిమాకు ఇది సీక్వెల్ అనే విషయం తెల్సిందే. ఇండియన్ సినిమాలో మాదిరిగానే కమల్ హాసన్ ఈ సీక్వెల్ లో కూడా సేనాపతి పాత్రను పోషిస్తున్నాడట. 90 ఏళ్ల వృద్ద వ్యక్తి పాత్రలో కమల్ కనిపించబోతున్నాడు.కమల్ హాసన్ తాను ఏ సినిమా చేసినా ఆ సినిమా కోసం పూర్తి స్థాయిలో కష్టపడతాడనే విషయం తెల్సిందే. ఈ చిత్రం కోసం కమల్ కొన్ని సీన్స్ లో గుజరాతీలో మాట్లాడాల్సి ఉంటుందట. అందుకోసం కమల్ ప్రస్తుతం గుజరాతీ భాషను నేర్చుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గుజరాతీ భాష కోసం ఒక ట్రైనీని కూడా పెట్టుకున్నాడట. గుజరాతీ భాషల్లో స్వయంగా తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే ఉద్దేశ్యంతో కమల్ గుజరాతీ భాషను నేర్చుకుంటున్నాడు.

ప్రస్తుతం కమల్ రాజకీయాల్లో ఉన్న కారణంగా ఈ సినిమాపై చాలా హైప్ ఉంది. కమల్ సేనాపతి పాత్రలో నటిస్తుండగా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కాజల్.. సిద్దార్థ.. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఇంకా పలువురు ముఖ్య నటీనటులు నటించబోతున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రంను తెలుగు.. హిందీ.. కన్నడ.. మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు. శంకర్ గత చిత్రాలు వసూళ్ల విషయంలో నిరాశ పర్చినా కూడా లైకా నిర్మాణ సంస్థ ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.