ఆందోళన కలిగిస్తున్న లోకనాయకుడి హడావుడి

Mon Jan 17 2022 20:15:56 GMT+0530 (IST)

Kamal Haasan hospitalized

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కొన్ని వారాల క్రితం కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. కరోనా నుండి తేరుకున్న కమల్ హాసన్ వెంటనే బుల్లి తెర షో బిగ్ బాస్ కు మరియు సినిమా షూటింగ్ కు జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు అనుకుంటున్న సమయంలో హడావుడిగా చెన్నైలోని ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. కమల్ హాసన్ ఎందుకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు అనే విషయాన్ని క్లారిటీగా చెప్పని తమిళ మీడియా కాస్త హడావుడి చేస్తూ అభిమానులను ఆందోళన లో నెట్టివేసింది. ఇప్పటి వరకు కమల్ హాసన్ కు ఏమయ్యింది.. అసలు ఆయన ఎందుకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడనే విషయాల గురించి ఇండస్ట్రీ వర్గాల ద్వారా క్లారిటీ లేదు.నిన్న మొన్నటి వరకు కూడా షూటింగ్ ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న కమల్ హాసన్ చాలా హెల్తీగా కనిపించాడు. కనుక ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదు.. కరోనా నుండి తేరుకున్నాడు కనుక ఒక సారి జనరల్ చకప్ గురించి వచ్చి ఉంటాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అభిమానులు కూడా అదే అభిప్రాయం తో ఉన్నారు. కమల్ హాసన్ వయసు రీత్యా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కనుక ఆయన రెగ్యులర్ గా జనరల్ చెకప్ కు వెళ్లడం అనేది కామన్ విషయం. కనుక కమల్ హాసన్ హెల్త్ గురించి మీడియాలో వస్తున్న వార్తల పై ఆందోళన అక్కర్లేదు అంటూ అభిమానులు అంటున్నారు. కమల్ హాసన్ ఆరోగ్యం విషయంలో కొన్ని తమిళ మీడియా సంస్థలు చేస్తున్న ఓవర్ యాక్షన్ వల్ల.. హడావుడి వల్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కమల్ హాసన్ ప్రస్తుతం హీరోగా విక్రమ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా లో విజయ్ సేతు పతి మరియు మలయాళ సూపర్ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న విక్రమ్ సినిమా మాత్రమే కాకుండా కమల్ సొంత నిర్మాణం లో శివ కార్తికేయన్ హీరోగా ఒక సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ విషయమై అధికారికంగా తాజాగా ప్రకటన వచ్చింది. అతి త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుంది అనుకుంటూ ఉండగా ఇలా కమల్ హాసన్ అనారోగ్య వార్తలు రావడంతో అభిమానులు సహజంగానే ఆందోళన చెందడం ఖాయం. కాని ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన అక్కర్లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న వాదన. కమల్ మళ్లీ షూటింగ్ లతో హడావుడి చేయడం ను రేపటి నుండే చూస్తామని మరి కొందరు నమ్మకంగా ఉన్నారు.