86 `విక్రమ్` కి ఈ `విక్రమ్` కి ఏంటి సంబంధం?

Wed May 25 2022 08:00:01 GMT+0530 (IST)

Kamal Haasan Vikram Movie

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించాయి. రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టాయి. పలు క్రేజీ రికార్డుల్ని నమోదు చేశాయి కూడా. ఈ నేపథ్యంలో మరో క్రేజీ మూవీ థియేటర్లలో సందడి చేయడానిక రెడీ అవుతోంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన తమిళ చిత్రం `విక్రమ్`. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై స్వయంగా కమల్ నటిస్తూ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అత్యంబత ఆసక్తిగా ఈ మూవీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ నరేన్ కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ చిత్రంలో కమల్ హాసన్ రూత్లెస్ రా ఏజెంట్ ఏకె.అరుణ్ కుమార్ గానూ విక్రమ్ గానూ కనిపించబోతున్నారు. `అడివి అన్నాకా.. సింహం.. పులి.. చిరుత.. అన్నీ వేటకెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆలోపు సూర్యాస్తమయం అయితే.. సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు అని ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో గెలుపు ఎక్కడా? ఎప్పుడూ? అని నిర్ణయించేది ప్రకృతి కాదు.. నేను. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లీవ్‌డ్ ఏ ఘోస్ట్` అంటూ పలికిన సంభాషణలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.

ట్రైలర్ ఎండ్ లో కమల్ హాసన్ `విక్రమ్.. విక్రమ్ అంటూ అరిచిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 86 లో వచ్చి విక్రమ్ మూవీలోని హీరో పాత్ర పేరు క్యారెక్టర్ ఈ సినిమాలో కమల్ క్యారెక్టర్ పాత్ర తీరు కూడా సేమ్ టు సేమ్. ఇంకీ విక్రమ్ ఘోస్ట్ గా మళ్లీ ఈ పార్ట్ లో కనిపిస్తాడా? .. ఈ విక్రమ్ కి 86 విక్రమ్ సినిమా కి వున్న సంబంధం ఏంటీ?.. దాదాపు 36 ఏళ్ల తరువాత అదే పాత్రని తాజా విక్రమ్ లో కంటిన్యూ చేశారా? లేక ఘోస్ట్ గా చూపించారా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని జూన్ 3న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ఇటీవలే ట్రైలర్ తో పాటు ఆడియోని కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇదిలా వుంటే ఈ క్రేజీ మూవీ కేజీఎఫ్ 2 సర్కారు వారి పాట లని ఫాలో అవుతోంది. ఇటీవల ఈ మూవీస్ ట్విట్టర్ తో టైఅప్ అయి హ్యాష్ ట్యాగ్ లతో ఎమోజీలతో నెట్టింట ట్రెండ్ ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  

ఇప్పడు ఇదే తరమాలో కమల్ హాసన్ `విక్రమ్` కూడా నెట్టింట సందడి చేయబోతోంది. #Vikram #VikramInAction  #VikramHitlist అంటూ హ్యాష్ ట్యాగ్ లని రిలీజ్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ లు జూన్ 13 వరకు ట్విట్టర్ లో ట్రెండ్ కానున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించాడు. తమిళంలో రూపొందిన ఈమూవీ తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల కానుంది. అంతే కాకుండా హిందీలోనూ విడుదల కాబోతోంది.