Begin typing your search above and press return to search.

లోక నాయకుడి తెలుగు ఫ్యాన్స్ కు క్లారిటీ

By:  Tupaki Desk   |   17 May 2022 1:30 AM GMT
లోక నాయకుడి తెలుగు ఫ్యాన్స్ కు క్లారిటీ
X
తమిళ స్టార్ హీరో కమల్‌ హాసన్‌ లోక నాయకుడిగా ఎన్నో సినిమాలు చేసి తమిళం కాకుండా ఇతర భాషల్లో కూడా అభిమానులను ఏర్పర్చుకున్నాడు. తమిళంలో ఏ స్థాయిలో కమల్‌ కు అభిమానులు ఉంటారో అదే స్థాయిలో తెలుగు లో కూడా ఆయనకు అభిమానులు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలను కూడా తెలుగు లో విడుదల చేస్తూ ఉంటారు.

కమల్‌ హాసన్ ఏ సినిమా చేసినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్త సందడి వాతావరణం ఉంటుంది. తెలుగు లో మరియు తమిళ సినీ ఇండస్ట్రీలో కమల్‌ హాసన్‌ స్టార్‌ డమ్‌ సమానంగా ఉన్నా కూడా విక్రమ్‌ సినిమా విషయం లో తెలుగు అభిమానులను అసంతృప్తికి గురి చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న కమల్ హాసన్‌ అభిమానులు విక్రమ్‌ సినిమా యొక్క విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్‌ సినిమాలో కమల్‌ హాసన్‌ మాత్రమే కాకుండా తమిళ స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి మరియు మలయాళ స్టార్‌ నటుడు ఫహద్‌ ఫాసిల్ కూడా నటించడం వల్ల మొత్తం సౌత్ ఇండియా వ్యాప్తంగా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేవలం తమిళ్ లో మాత్రమే ట్రైలర్ ను విడుదల చేయడం పట్ల ఆయన అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో విక్రమ్‌ ట్రైలర్ వస్తుందని అంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. కాని వారి ఆశ అడియాశ అయ్యింది.. అభిమానులు ఎదురు చూసిన తెలుగు విక్రమ్‌ టైటిల్ రాలేదు. దాంతో విక్రమ్‌ ను తెలుగు లో విడుదల చేసే ఉద్దేశ్యం లేదా ఏంటీ అంటూ అనుమానాలు మొదలు అయ్యాయి. తాజాగా ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా ఒక స్పష్టత ఇచ్చారు.

గతంలో కమల్‌ సినిమాలన్నింటికి కూడా తెలుగు లో బాలు గారు డబ్బింగ్‌ చెప్పే వారు. ఇప్పుడు కమల్‌ డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాడు. తెలుగు బాగానే మాట్లాడే కమల్‌ హాసన్ డబ్బింగ్‌ చెప్పడం కష్టం ఏమీ కాదు. కాని ప్రస్తుతం కమల్‌ ఇతర పనులతో బిజీగా ఉండటం వల్ల తెలుగు ట్రైలర్ కు డబ్బింగ్‌ చెప్పలేక పోయాడట. త్వరలోనే డబ్బింగ్‌ చెప్పి విడుదల చేస్తారని తెలుస్తోంది. తెలుగు లో ఈ సినిమాను ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు.. డబ్బింగ్‌ రైట్స్ దక్కించుకున్న వారు ఎవరు అనే విషయం లో స్పష్టత రావాల్సి ఉంది.