కమల్ హాసన్.. విజయ్.. మహేష్ బాబు.. మిస్ అయ్యారా? తప్పించుకున్నారా?

Fri Sep 30 2022 10:43:07 GMT+0530 (India Standard Time)

Kamal Haasan.. Vijay.. Mahesh Babu.. Did you miss it? Have you escaped?

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ 1 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి తాను మూడు నాలుగు దశాబ్దాలుగా కలలు కంటున్నాను అంటూ దర్శకుడు మణిరత్నం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆయన ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను రెండు పార్ట్ లు గా తెరకెక్కించి నేడు మొదటి పార్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.మొదట ఈ ప్రాజెక్ట్ ను కమల్ హాసన్.. బాలీవుడ్ హీరోయిన్ రేఖ ఇంకా పలువురు స్టార్స్ తో చేయాలని చాలా సంవత్సరాల క్రితం అనుకున్నాడు. అందుకు చర్చలు కూడా జరిగాయి. కానీ అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదు. ఆ తర్వాత పలువురు హీరోలతో కూడా చర్చలు జరిపారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా మణిరత్నం సర్ చర్చలు జరిపారట.

తాజాగా సినిమా విడుదల అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురు స్టార్ హీరోలు వదిలేసిన పాత్రను విక్రమ్ చేశాడు... ఇప్పుడు సినిమా విడుదల అయ్యింది.. విక్రమ్ సినిమాలో మంచి నటన కనబర్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పాత్ర కూడా అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన వారు ట్విట్టర్ లో చర్చించుకుంటున్నారు.

ఈ సమయంలో పొన్నియన్ సెల్వన్ ను మహేష్ బాబు.. విజయ్.. కమల్ హాసన్ లు చేయక పోవడంతో మిస్ అయ్యి మంచి అవకాశంను చేజార్చుకున్నారా లేదంటే చేయక పోవడం మంచిదే అయ్యి తప్పించుకున్నారా అంటూ చర్చ మొదలు అయ్యింది. ఎవరికి తోచిన విధంగా వారు సినిమాని విశ్లేషిస్తూ ఆ ముగ్గురు హీరోల గురించి మాట్లాడుతున్నారు.

సినిమా పూర్తి స్థాయి ఫలితం రావడానికి సమయం పడుతుంది. అప్పుడు కానీ ఆ ముగ్గురు సినిమాను మిస్ చేసుకున్నారా... ప్రమాదం నుండి తప్పించుకున్నారా అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ మీడియా సర్కిల్స్ వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.