లోకులు అనే కాకులకు.. కమల్ సారీ చెప్పాలా!

Wed Feb 26 2020 11:45:12 GMT+0530 (IST)

Kamal Haasan Should Apologise to Tamil Star Rekha

ఇటీవల వెటరన్ హీరోయిన్ రేఖ అనూహ్యంగా వివాదాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.  విశ్వనటుడు కమల్ హాసన్-దర్శక శిఖరం కె. బాలచందర్ ని ఉద్దేశించి ఆరోపణలు చేసారు. తన అనుమతి లేకుండానే ఆ ఇద్దరూ ప్రీ ప్లాన్ డ్  రేఖని లిప్ లాక్ సన్నివేశంలో (పున్నాగై మున్నన్ సినిమాలో) నటింపజేసారని  30 ఏళ్ల క్రితం నాటి సన్నివేశాన్ని గుర్తు చేసి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇది లైంగిక వేధింపు లాంటిందేనని సంచలన వ్యాఖ్యలు చేసారు. అదీ ఆ సీన్ తన 16 ఏళ్ల వయసులో జరిగింది. కనీసం తన అనుమతి కూడా తీసుకోకుండా మోసం చేసారని వాపోయారు. అటుపై వ్యక్తిగతంగా ప్రేక్షకుల నుంచి..ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపారు.16 ఏళ్ల వయసులో అలాంటి సీన్ కు ఎలా అంగీకరించిందని సమాజం ప్రశ్నించినప్పుడు తాను ఎలాంటి సమాధానం చెప్పలేకపోయానని వాపోయారు.  ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కమల్ హాసన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు పోటెత్తాయి. అంత పెద్ద స్టార్.. కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ హీరోయిన్ పర్మిషన్ లేకుండా సీన్ డిమాండ్ చేసిందని అలా వ్యవహరిస్తారా? అని కామెంట్లతో విరుచుకుపడ్డారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలంటూ నెటిజనులు డిమాండ్ చేసారు. మరి ఈ వివాదంపై కమల్  రియాక్షన్ ఎలా ఉంటుందో..

అయితే కమల్ హాసన్ నుంచి ఎప్పుడూ క్షమాపణలు కోరుకోలేదని రేఖ సన్నాయి నొక్కులు నొక్కడంపై రివర్స్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకులు కాకుల్లా వ్యవరించినందుకు ఎక్కువగా బాధగా ఉందని రేఖ వాపోవడం చర్చకొచ్చింది. అలాగే ఆ సినిమా కోలీవుడ్ లో పెద్ద విజయం సాధించడంతో తన కెరీర్ మారిపోయిందని..అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో అవకాశాలు అందుకున్నానంటే కారణం బాలచందర్ వల్లేనని తెలిపారు. అయితే 30 ఏళ్ల నాటి సంఘటనను ఇప్పుడిలా గొంతెత్తి చెప్పడం అంటే రేఖ పబ్లిసిటీ కోరుకుంటున్నారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు కమల్ అభిమానులు.