Begin typing your search above and press return to search.

వరుస ఫ్లాప్‌ లతో కొత్తగా ట్రై చేస్తున్న కళ్యాణ్‌ రామ్‌

By:  Tupaki Desk   |   21 Feb 2020 11:00 AM GMT
వరుస ఫ్లాప్‌ లతో కొత్తగా ట్రై చేస్తున్న కళ్యాణ్‌ రామ్‌
X
నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన కళ్యాణ్‌ రామ్‌ మరో వైపు సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. హీరోగా సక్సెస్‌ ల కంటే నిర్మాత గా కాస్త బెటర్‌ గా కళ్యాణ్‌ రామ్‌ ఫలితాలు దక్కించుకున్నాడు. నిర్మాతగా పలు చిత్రాలు ఈయన కు లాభాలను తెచ్చి పెట్టాయి. హీరోగా మాత్రం వరుసగా ఫ్లాప్‌ లే వస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఎంత మంచివాడవురా చిత్రం ప్రేక్షకులను నిరాశ పర్చింది. హీరోగా కొత్త సినిమా ప్రారంభానికి ముందు తమ్ముడు ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ కాంబో మూవీ నిర్మాణంను మొదలు పెట్టాడు.

హాసిని అండ్‌ హారిక బ్యానర్‌ తో కలిసి ఎన్టీఆర్‌ 30 సినిమాను కళ్యాణ్‌ రామ్‌ నిర్మించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అన్న కళ్యాణ్‌ రామ్‌ ను ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా చేశాడు ఎన్టీఆర్‌. తమ్ముడు సినిమాను మరోసారి నిర్మించబోతున్న కళ్యాణ్‌ రామ్‌ తన బ్యానర్‌ లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు గా అనిపిస్తుంది.

కళ్యాణ్‌ రామ్‌ బ్యానర్‌ పేరు ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ అంటూ ఉంటుంది. ఈ బ్యానర్‌ లో గతం లో వచ్చిన సినిమాల పోస్టర్స్‌ పై తెలుగులో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ అంటూ ఉండేది. అలాగే ఎన్టీఆర్‌.. బసవతారకం గార్ల ఫొటోలు ఉండేవి. కాని ఆ లోగోను కాస్త మార్చాడు. ఎన్టీఆర్‌ ఫొటోను మాత్రమే పెట్టి నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ అంటూ ఇంగ్లీష్‌ లో పెట్టాడు.

కళ్యాణ్‌ రామ్‌.. ఎన్టీఆర్‌ ల కలయిక లో ఇది కొత్త బ్యానర్‌ అయ్యి ఉంటుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కొందరు మాత్రం ఫ్లాప్‌ లను తప్పించుకునేందుకు కళ్యాణ్‌ రామ్‌ ఇలా కొత్తగా ట్రై చేసినట్లు గా ఉన్నాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది కళ్యాణ్‌ రామ్‌ ఏమైనా చెప్తాడో చూడాలి.