Begin typing your search above and press return to search.

కల్యాణ్ రామ్ ఈ సారి కూడా కొట్టినట్టే!

By:  Tupaki Desk   |   7 Feb 2023 10:09 AM GMT
కల్యాణ్ రామ్ ఈ సారి కూడా కొట్టినట్టే!
X
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 10 న రిలీజ్ కానుంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజేంద్రరెడ్డి డైరెక్ట్ చేశాడు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ లో నటిస్తున్నాడు. మూడు డిఫరెంట్ పాత్రలతో కళ్యాణ్ రామ్ చేస్తున్న ప్రయోగం ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాకి బాగానే కలిసి వస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ టైం లో భారీ సినిమాలు విడుదల కావడం లేదు. ఉపేంద్ర హీరోగా పాన్ ఇండియా సినిమా కబ్జా విడుదలవుతుంది. కానీ దానికి అంతగా బజ్ క్రియేట్ కాలేదు. దీంతో కళ్యాణ్ రామ్ అమిగోస్ పై అంతగా ప్రభావం చూపించకపోవచ్చు. మరోవైపు పాప్ కార్న్ లాంటి చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా అమిగోస్ రిలీజ్ కి ముందే ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. కళ్యాణ్ రామ్ చేసిన ఈ ప్రయోగానికి పాజిటివ్ టాక్ వస్తే భారీ వసూళ్లు అందుకునే అవకాశం కనిపిస్తుంది.

గత ఏడాది బింబిసారా, సీతారామం ఒకేసారి రిలీజ్ అయ్యాయి, బింబిసారకి సీతారామం గట్టి పోటీనే ఇచ్చింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈసారి కళ్యాణ్ రామ్ ఎలాంటి పోటీ లేకుండా డిఫరెంట్ మూవీతో హిట్ కొడతారని అంతా అనుకుంటున్నారు. మరోవైపు బింబిసార ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అమిగోస్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గెస్టుగా హాజరయ్యారు.

దీంతో ఈ సెంటిమెంట్ మరోసారి కలిసి వస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లో మరో భారీ హిట్ ఖాయమని అంటున్నారు.. చూడాలి ఇక. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా అశికా రంగనాథ్ చేస్తుంది. అమిగోస్ సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.