Begin typing your search above and press return to search.

బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా క‌ళ్యాణ్ రామ్!

By:  Tupaki Desk   |   9 Dec 2022 2:30 PM GMT
బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా క‌ళ్యాణ్ రామ్!
X
నంద‌మూరి వార‌సుడు క‌ళ్యాణ్ రామ్ ఫుల్ స్వింగ్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `బింబిసార‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని మ‌ళ్లీ గెలుపు గుర్ర‌మెక్కాడు. మునుప‌టిలా కాకుండా క‌థ‌ల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌లు వ‌హిస్తూ కొత్త సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నాడు. డిఫ‌రెంట్ జాన‌ర్ క‌థ‌ల్ని వెతికి ప‌ట్టుకుంటున్నాడు. పాత్ర ప‌రంగా ఇన్నో వేటివ్ గా ఉండేలా చూసుకుంటున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే `అమిగోస్`..`డెవిల్` లాంటి వైవిథ్య‌మైన చిత్రాల్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. రెండు వేటిక‌వి ప్రత్యేక‌తని క‌ల్గిని చిత్రాలు. ఇక డెవిల్ కోసం క‌ళ్యాణ్ రామ్ గ‌ట్టిగానే శ్ర‌మిస్తున్నాడు. శారీర‌కంగా ప్ర‌త్యేకంగా సిద్ద‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. లుక్ ప‌రంగా ఛేంజోవ‌ర్ తీసుకు రావాల‌నే క‌ళ్యాణ్ రామ్ కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ త‌మిళ‌నాడులోని కారైకుడిలో జ‌రుగుతోంది. 20 రోజుల పాటు అక్క‌డ ఏక‌ధాటిగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. తాజాగా ఈ సినిమా క‌థాంశం లీకైంది. ఇది ఓ పిరియాడిక్ స్టోరీ అని స‌మాచారం. ఇందులో క‌ళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడుట‌. ఈ రెండు హిట్స్ ని బ‌ట్టి డెవిల్ డిఫ‌రెంట్ కంటెంట్ గ‌ల చిత్ర‌మ‌ని క్లారిటీ వ‌స్తోంది.

పీరియాడిక్ స్టోర్ కావ‌డంతో క‌ళ్యాణ్ రామ్ కొన్నేళ్ల క్రితం ఆహార్యంలో క‌నిపించే అవ‌కాశం ఉంది. అప్ప‌టి బ్రిటీష సీక్రెట్ ఏజెంట్ లు ఎలా ఉండేవారో? అలాంటి లుక్ తీసుకురానున్నారు. అందుకోస‌మే క‌ళ్యాణ్ రామ్ ప్ర‌త్య‌కంగా సిద్ద‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగిన బింబిసార అలా స‌క్సెస్ అందుకున్న చిత్ర‌మే. ఓటీటీ ఆడియన్స్ కి ఆ క‌థ బాగా కెనెక్ట్ అయింది. యూనివ‌ర్శ‌ల్ గా తెలుగు క‌థ‌ల‌కు ఇప్పుడిప్పుడే ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. దీంతో క‌థ‌ల విష‌యంలో క‌ళ్యాణ్‌ రామ్ మ‌రింత షైన్ అయిన‌ట్లు తెలుస్తోంది. డెవిల్ చిత్రాన్నిన‌వీన్ మేడారం తెర‌కెక్కిస్తున్నాడు. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.