టీజర్ టాక్ - ‘ఎమెల్యే’ వెరైటీగా ఉన్నాడే

Sun Jan 14 2018 13:19:10 GMT+0530 (IST)

Kalyan Ram MLA Movie Teaser Talk

నందమూరి హీరో స్పీడ్ మీదున్నాడు. మొన్న నా నువ్వే టీజర్ - ఫస్ట్ లుక్ తో కొత్తగా అనిపించిన కళ్యాణ్ రామ్ వారం తిరక్కుండానే మరో టీజర్ తో వచ్చేసాడు. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తో చేస్తున్న ఎమెల్యే-మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి మూవీ టీజర్ ఇందాకే విడుదల చేసారు. కథ గురించి ఎక్కడా క్లూ దొరక్కుండా కేవలం హీరో గెటప్ మాత్రమే చూపిస్తూ చాలా తెలివిగా దీన్ని కట్ చేసారు. అసిస్టెంట్ గా కనిపిస్తున్న పృథ్వి మొదట రిక్షా లాగుతూ అందులో కళ్యాణ్ రామ్ ని వైట్ అండ్ వైట్ పొలిటీషియన్ డ్రెస్ లో తీసుకొస్తూ ఉండగా తర్వాత ఫ్రేంలో అదే గెటప్ లో కళ్యాణ్ రామ్ స్టైలిష్ గా బయటికి నడుచుకుంటూ రావడం ఆకట్టుకుంది. పృథ్వి తిప్పండి సార్ మీసం అంటే తగ్గించాంగా అని కళ్యాణ్ రామ్ బదులివ్వడం బాగానే పేలింది.మూస సినిమాల నుంచి రూట్ మార్చి కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేస్తున్నాడని అర్థమైపోయింది. నిర్మాతగా జై లవకుశతో లాస్ట్ ఇయర్ మంచి సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం రెండు సినిమాలతో వస్తున్నాడు. నా నువ్వే లో తమన్నా హీరొయిన్ కాగా ఇందులో కాజల్ తన పక్కన డ్యూయెట్స్ పాడబోతోంది. ఈ ఇద్దరూ స్టార్ హీరోస్ అందరితో చేసిన వాళ్ళు కావడం గమనార్హం. ఎమెల్యే టీజర్ లో కాజల్ ని రివీల్ చేయలేదు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఆకర్షణగా నిలవనుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఒక మధ్య తరగతి వాడు ప్రేమ కోసం ఎమ్యెల్యే అయ్యే దాకా ఎలా చేరుకున్నాడు ఏం చేసాడు అనే పాయింట్ చుట్టూ ఉపేంద్ర మాధవ్ ఈ కథ రాసుకున్నట్టు టాక్. ట్రైలర్ ఆడియో విడుదల అయ్యాక డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. నా నువ్వే ఎమెల్యే లలో ఏది ముందు వస్తుందో మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు .