Begin typing your search above and press return to search.

అబ్బాయ్ బాబాయ్ క‌థ‌లు మారాలి గురువా

By:  Tupaki Desk   |   26 Feb 2020 10:15 AM GMT
అబ్బాయ్ బాబాయ్ క‌థ‌లు మారాలి గురువా
X
ఇండ‌స్ట్రీ క‌థ‌ల వెంట ప‌రుగులు పెడుతోంది. హీరోలు క‌థ‌ల్లేక‌పోతే ఎంత పెద్ద ద‌ర్శ‌కుడిని అయినా తిర‌స్క‌రిస్తున్నారు. మ‌హేష్ - చ‌ర‌ణ్‌- బ‌న్ని- ప్ర‌భాస్ .. ఇలా హీరోలంతా ర‌క‌ర‌కాల అనుభ‌వాల నుంచి పాఠాలు నేర్చుకుని క‌థ‌ల ఎంపిక విష‌యంలో హై ఎలెర్ట్ చూపిస్తున్నారు. అయితే నంద‌మూరి కాంపౌండ్ ఈ విష‌యంలో బాగా వెన‌క‌బ‌డి ఉంద‌న్న విమ‌ర్శ‌లు తాజాగా వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవ‌ల న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌-నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌న్నివేశ‌మే ఇందుకు ఎగ్జాంపుల్. ఓవైపు తార‌క్ తెలివైన ఎంపిక‌ల‌తో స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా దూసుకెళుతుంటే బాల‌య్య‌- క‌ళ్యాణ్ రామ్ మాత్రం వెన‌క‌బ‌డిపోతున్నారు. వ‌రుస ఫ్లాపుల‌తో డీలా ప‌డిపోతున్నారు. అయితే ఈ వైఫ‌ల్యాల‌కు కార‌ణ‌మేమిటో బాబాయ్ అబ్బాయ్ విశ్లేషించారా? ఈసారైనా ఈ డైల‌మా నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.

ఇప్ప‌టికే వ‌రుస ఫ్లాపుల‌తో బాల‌య్య మార్కెట్ చాలా వ‌ర‌కూ ప‌డిపోయింద‌న్న అసంతృప్తి ట్రేడ్ లో ఉంది. రొటీన్ క‌థ‌ల‌తో అదే పాత మూస పంథాలో వెళుతుండ‌డం అత‌డిపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. వ‌ర్క‌వుట్ కాని ఫార్ములానే ప‌దే ప‌దే రిపీట్ చేస్తుండ‌డం బాల‌య్య‌కు పెద్ద మైన‌స్ గా మారింది. ఇక క‌థ‌లు మారుతున్న నేటి ట్రెండ్ లో ఆదిత్య 369 లాంటి క్రియేటివ్ స్ట‌ఫ్ కి ఛాన్స్ ఉన్నా బాల‌య్య ఆ కోవ‌లో ట్రై చేసిందే లేదు. ఇప్పుడు మ‌రోసారి మాస్ మ‌సాలా సినిమాలు తీసే బోయ‌పాటినే న‌మ్మి అవ‌కాశం ఇవ్వడంపై కొన్ని విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. ఇక‌పోతే క‌ళ్యాణ్ రామ్ న‌టుడిగా ఎంతో ప‌రిణ‌తి చెంది ఫ‌ర్వాలేద‌నిపిస్తున్నా క‌థ‌లు- ద‌ర్శ‌కుల ఎంపిక‌లోనే త‌డ‌బ‌డుతున్నారు. ఇక ప్ర‌చార‌టీమ్ వైఫ‌ల్యం నంద‌మూరి ఆర్ట్స్ బ్యాన‌ర్ ప్ర‌భ‌ను మ‌స‌క‌బారేలా చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అన్నిటినీ గ్ర‌హించి ప్ర‌క్షాళ‌న చేయ‌డంలో క‌ళ్యాణ్ రామ్ వైఫ‌ల్యంపై ఇప్ప‌టికే మీడియా వ‌ర్గాల్లో గుస‌గుస‌లు న‌డుస్తూనే ఉన్నాయి. మ‌రి అన్నిటినీ గ్ర‌హించి కెరీర్ ని దారిలోకి తెస్తున్నారా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.