మెగాఅల్లుడి మూవీ ఓటిటిలోకి రానుందా..??

Thu Apr 22 2021 21:00:01 GMT+0530 (IST)

Kalyan Dev Upcoming Movie Updates

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. విజేత సినిమాతో టాలీవుడ్ హీరోగా అరంగేట్రం చేసిన కళ్యాణ్.. రెండో సినిమా 'సూపర్ మచ్చి'ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయాలనీ భావించారు మేకర్స్. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితులు కారణంగా సినిమాను ఓటిటిలో రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారట. మెగాఫ్యామిలీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సెకండ్ మూవీనే కాబట్టి రిస్క్ లేకుండా డిజిటల్ రిలీజ్ బెటర్ అనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను పులి వాసు తెరకెక్కిస్తుండగా రిజ్వాన్ నిర్మిస్తున్నారు.కమర్షియల్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా మరి ఎప్పుడు రిలీజ్ కబురు వినిపిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. అప్ కమింగ్ హీరోగా కళ్యాణ్ దేవ్ బాగానే కష్టపడుతున్నాడు. అందుకే వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ చేతిలో సూపర్ మచ్చి మూవీతో పాటు కిన్నెరసాని అనే సినిమా కూడా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కిన్నెరసాని సినిమాను ప్రకటించాడు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రజని తాళ్లూరి రవి చింతల ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అలాగే రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మరి ఈ సినిమాలను అప్పటి పరిస్థితులు బట్టి ఎలా రిలీజ్ చేస్తారో చూడాలి. మొత్తానికి మెగాహీరో జోరులోనే ఉన్నాడని అర్ధమవుతుంది.