ఫొటోటాక్ : మెగా అల్లుడి నెగటివ్ ఆనందం

Sat Jul 11 2020 17:40:11 GMT+0530 (IST)

PhotoTalk: Mega Son in law Negative? Happiness

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఇటీవల కరోనా భయంతో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నట్లుగా పేర్కొన్న విషయం తెల్సిందే. కూతురు పుట్టిన రోజు అయినా కూడా సంతోషంగా కేక్ తినిపించలేక పోయినందుకు చాలా బాధపడుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సూపర్ మచ్చి చిత్రం షూటింగ్ లో పాల్గొన్న కళ్యాణ్ దేవ్ స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయాడు. రెండు వారాల పాటు పిల్లలకు దూరంగా ఉన్న కళ్యాణ్ దేవ్ ఇటీవలే కోవిడ్ నిర్థారణ పరీక్ష చేయించుకున్నాడట.ఆ పరీక్షలో నెగటివ్ రిపోర్ట్ రావడంతో ఎట్టకేలకు భార్య శ్రిజతో పాటు పిల్లలను దగ్గరకు తీసుకున్నాడు. ఈ సందర్బంగా గ్రూప్ హగ్ అంటూ సంతోషంను షేర్ చేసుకున్నాడు. నెగటివ్ అంటూ వచ్చిన తర్వాతే పిల్లలను దగ్గరకు తీసుకున్నానని ఇన్నాళ్లు సామాజిక దూరం పాటిస్తూ వచ్చానంటూ చెప్పుకొచ్చాడు.

ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా పిల్లలకు పెద్ద వారికి దూరంగా ఉండాలంటూ కళ్యాణ్ దేవ్ తన పోస్ట్ లతో సందేశం ఇచ్చాడు. మెగా హీరో కళ్యాణ్ దేవ్ సూచనలు తప్పకుండా అందరు పాటించాలి. కుటుంబ సభ్యులతో పాటు తాను ఆరోగ్యంగా ఉండేందుకు సామాజిక దూరం పాటించాలంటూ ఆయన సూచించాడు.