Begin typing your search above and press return to search.

అశ్వ‌థ్థామ డైరెక్ట‌ర్ క‌ల్కి రైట‌ర్ కలిసి..!

By:  Tupaki Desk   |   25 Oct 2020 8:10 AM GMT
అశ్వ‌థ్థామ డైరెక్ట‌ర్ క‌ల్కి రైట‌ర్ కలిసి..!
X
జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఫ్యాష‌నేట్ గా సినిమాలు తీస్తున్నారు నిర్మాత రామ్ తాళ్లూరి. చుట్టాల‌బ్బాయ్.. నేల టిక్కెట్.. డిస్కోరాజా లాంటి సినిమాల్ని తెర‌కెక్కించింది ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ లో ఆయ‌న వ‌రుస‌గా సినిమాల్ని నిర్మిస్తున్నారు. ర‌వితేజ ఆది లాంటి స్టార్ల‌తో సినిమాలు చేసినా ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. అయినా జ‌య‌మే ల‌క్ష్యంగా.. ఎస్.ఆర్.టి బ్యాన‌ర్ లో ఏడాదికి రెండు మూడు సినిమాలు ప్లాన్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

వ్యాపార రంగంలో ఉన్నా.. నిర్మాత రామ్ తాళ్లూరి సినిమా పై ఫ్యాష‌న్ తో వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఈ బ్యాన‌ర్ లో ప‌లు క్రేజీ సినిమాల్ని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఓ క్రేజీ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. అశ్వ‌థ్థామ డైరెక్ట‌ర్ క‌ల్కి రైట‌ర్ కలిసి.. ప‌ని చేస్తున్న చిత్రమిది. ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ లో ఆరో చిత్ర‌మిది. రామ్ తాళ్లూరి- సాయి రిషిక స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది.

ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదో థ్రిల్ల‌ర్ జోన‌ర్ సినిమా అని చిత్ర‌బృందం వెల్లించింది. తాజాగా ద‌స‌రా పోస్ట‌ర్ లో వివ‌రాల్ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక స‌హ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌వుతున్నాయి. త‌దుప‌రి షెడ్యూల్స్ వివ‌రాల్ని వెల్ల‌డించాల్సి ఉంది.
అర‌వింద స్వామి న‌టించిన భోగ‌న్ చిత్రాన్ని ఈ సంస్థ తెలుగులో అందించే ప్ర‌య‌త్నం చేస్తోంది. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా రామ్ తాళ్లూరి ఓ సినిమాని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ క‌థ‌నాలొచ్చాయి.