ప్రెగ్నెన్సీని దాచేందుకు చాలా ప్రయత్నించిందట

Fri Jan 17 2020 14:17:18 GMT+0530 (IST)

Kalki Koechlin Discusses About Her Pregnancy Before Marriage

హాలీవుడ్ స్టార్స్ పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఈమద్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ప్రెగ్నెన్సీకి పెళ్లితో సంబంధం ఏంటీ అంటున్నారు. మొత్తానికి పెళ్లికి ప్రెగ్నెన్సీకి సంబంధం లేదు అనే వారి జాబితాలో మరో బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ చేరిపోయింది. ఈమె తన ప్రియుడితో సహజీవనం సాగిస్తుంది. ఇప్పుడు ఆమె తల్లి కాబోతుంది. పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతుంది అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నా కూడా ఆమె మాత్రం ప్రస్తుతం తమకు చాలా సంతోషంగా ఉందని.. మేమిద్దరం తల్లి దండ్రులం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని అంటోంది.కల్కి తాజాగా కరీనా కపూర్ ఖాన్ నిర్వహించే ఒక రేడియో షోలో పాల్గొంది. ఆ సందర్బంగా తన సినీ కెరీర్ మరియు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. కల్కి తన 25 సంవత్సరాల వయసులో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ను వివాహం చేసుకుంది. వీరి వివాహం 2011లో కాగా రెండు సంవత్సరాల్లోనే విడిపోయారు. 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. మా ఇద్దరి మద్య వయసు ఎక్కువ తేడా ఉండటంతో పాటు చిన్న వయసులో నేను వివాహం చేసుకోవడం వంటి కారణాల వల్ల మేము విడాకులు తీసుకున్నాము అంది.

అనురాగ్ తో విడిపోయిన తర్వాత కూడా ఆయనతో స్నేహంగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈమె హర్ష్ బెర్గ్ తో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇద్దరం కూడా లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంది. నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పకూడదనుకున్నాను. కాని నా మేకప్ మెన్ కు మాత్రం తెలియకుండా ఆగలేదు. నాలుగవ నెల సమయంలో నేను ప్రెగ్నెంట్ అనే విషయం అందరికి తెలిసి పోయింది.

నాలో వచ్చిన మార్పులను బట్టి అందరు కూడా గుర్తించారు. ఎప్పటికైనా తెలియాల్సిందే. కాస్త ముందుగానే తెలిసింది. కొందరు నేను తల్లి కాబోతున్నందుకు సంతోషంగా ఉంటే కొందరు మాత్రం పెళ్లి కాకుండానే తల్లి ఏంటీ అంటూ విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి నేను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నందుకు సంతోషంగా ఉంది